పెళ్లి తరువాత జైలుకు వెళ్లనున్న హీరో నితిన్‌

పెళ్లి తరువాత జైలుకు వెళ్లనున్న హీరో నితిన్‌
x
Nithin (File photo)
Highlights

యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. తన ప్రేయసి షాలినితో నితిన్ వివాహం జరబోతుంది.

యంగ్ హీరో నితిన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే.. తన ప్రేయసి షాలినితో నితిన్ వివాహం జరబోతుంది. తాజాగా హైదరాబాదులోని నితిన్ నివాసంలో అత్యంత సన్నిహితుల మద్య నిశ్చితార్థం వేడుక జరిగింది. నితిన్ దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఏప్రిల్ 16 న వీరి వివాహం దుబాయ్ లో జరుగుతుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాదులో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ గా రిసిప్షన్ ని ఏర్పాటు చేయనున్నారు.

అయితే దిని తర్వాత నితిన్ జైలుకి వేల్లనున్నాడట నితిన్ .. జైలు అంటే నిజమైన జైలు కాదు లెండి! విభిన్నమైన కథలని తెరకెక్కించే చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ సినిమాని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇందులో నితిన్‌ ఓ ఖైదీగా కనిపించనున్నాడు. అయితే దాదాపుగా అరవై శాతం సినిమాని జైల్లోనే తెరకెక్కిస్తున్నారు. దీనికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఇక తాజాగా నితిన్ నటించిన 'భీష్మ' ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ ను సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ని రాబడుతుంది. ప్రస్తుతం నితిన్ 'రంగ్‌ దే' చిత్రంతో బిజీగా ఉన్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఈ ఏడాది జూన్‌ నాటికి పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని నితిన్ అనుకుంటున్నట్టు సమాచారం.. కృష్ణచైతన్య దర్శకత్వంలో మరో సినిమాని చేయనున్నాడు నితిన్.. గతంలో వీరి కాంబినేషన్ లో చల్ మోహన్ రంగ అనే సినిమా తెరకెక్కింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories