Megastar Chiranjeevi: నితిన్ కాబోయే అత్తగారికి మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఇదే..

Megastar Chiranjeevi: నితిన్ కాబోయే అత్తగారికి మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఇదే..
x
Highlights

మొన్నటివరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఒకడిగా ఉన్న హీరో నితిన్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు.

మొన్నటివరకు టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఒకడిగా ఉన్న హీరో నితిన్ ఇప్పుడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. షాలిని రెడ్డి కందుకూరిని నితిన్ వివాహం చేసుకోబోతున్నాడు. తాజాగా నితిన్ నివాసంలో అత్యంత సన్నిహితుల మధ్య నితిన్ - షాలినిల ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. హీరో నితిన్ దినికీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి తన అభిమానులతో పంచుకున్నాడు. వీరి పెళ్లి ఏప్రిల్ 16న దుబాయ్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరగనుంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల కోసం హైదరాబాదులో గ్రాండ్ గా రిసిప్షన్ ఏర్పాటు చేస్తున్నారు..

నితిన్ పెళ్లి చేసుకునే షాలిని రెడ్డి తెలంగాణలోని నాగర్ కర్నూల్ కి చెందింది. ఆమె తల్లిదండ్రులు డాక్టర్లు. డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ షేక్ నూర్జహాన్ నాగర్ కర్నూలులో గత 20 ఏళ్లుగా ప్రగతి నర్సింగ్ హోమ్‌ను నడుపుతున్నారు. వీరిది ప్రేమ వివాహం కాగా ఇప్పుడు తమ రెండో కుమార్తె షాలినికి కూడా ప్రేమ వివాహమే చేస్తున్నారు. కామన్ ఫ్రెండ్ వల్ల నితిన్ , షాలిని రెడ్డికి 2012లో స్నేహం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు.

అయితే ఇప్పుడు షాలిని రెడ్డి కుటుంబానికి, మెగా ఫ్యామిలీకి ఓ చిన్న అనుబంధం ఉంది. నితిన్ కాబోయే అత్తగారు.. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజా రాజ్యం పార్టీలో చేరారు. ఇక 2009 సార్వత్రిక ఎన్నికల్లో నాగర్ కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో ఆమెకూడా రాజకీయలకి దూరంగా ఉంటూ వచ్చారు. అయినప్పటికీ ఇప్పటికి మెగా ఫ్యామిలీకి మంచి ఫ్యామిలీ రిలేషన్ మైంటైన్ చేస్తున్నారు.

ప్రస్తుతం నితిన్ 'భీష్మ' అనే సినిమాలో నటించాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. ఈ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు. తాజాగా రిలీజ్ అయిన చిత్ర ట్రైలర్ ఆకట్టుకుంటుంది. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories