మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి నితిన్ అవుట్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ నుంచి నితిన్ అవుట్
x
Highlights

ఎట్టకేలకు హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నేడు హైదరాబాదులో షాలిని అనే అమ్మాయితో నితిన్ ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఏప్రిల్ 16...

ఎట్టకేలకు హీరో నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నేడు హైదరాబాదులో షాలిని అనే అమ్మాయితో నితిన్ ఎంగేజ్మెంట్ అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. ఏప్రిల్ 16 దుబాయ్ లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఆ తర్వాత హైదరాబాదులో గ్రాండ్ గా రిసిప్షన్ ని నిర్వహించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నితిన్ పెళ్లి చేసుకుంటున్న షాలిని ఓ డాక్టర్ అని వీరిద్దరికీ 2012లో పరిచయం కాగా, ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. వారి ప్రేమకి ఇరువురు కుటుంబాలు కూడా ఒప్పుకోవడంతో ఇద్దరు ఒక్కటయ్యారు. తమ అభిమాన హీరోకి పెళ్లి అవుతుండడంతో నితిన్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

2002 లో జయం సినిమాతో వెండితెరకి పరిచయం అయిన నితిన్ హీరోగా మొదట్లో మంచి విజయాలను అందుకున్నాడు. ఆ తరవాత కొన్ని అపజయాలు వచ్చినప్పటికి మళ్ళీ ఇష్క్ సినిమాతో నిలదొక్కుకొని వరస సినిమాలతో హిట్స్ కొడుతున్నాడు. తాజాగా నితిన్ నటించిన భీష్మ సినిమా మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 21 న విడుదల కానుంది. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ పై నాగవంశీ ఈ సినిమాని నిర్మించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories