Bheeshma: ఆ అయిదుగురు నా పంచప్రాణాలు... ఆ తర్వాతే నా భార్య

Bheeshma: ఆ అయిదుగురు నా పంచప్రాణాలు... ఆ తర్వాతే నా భార్య
x
Highlights

యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన

యంగ్ హీరో నితిన్ తాజాగా నటించిన చిత్రం 'భీష్మ'.. రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. నిన్న చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించగా అందులో భాగంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ ఈవెంట్ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు.

ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. " స్క్రిప్ట్ పక్కాగా ఉండాలని అందుకే ఇంత గ్యాప్ తీసుకున్నానని నితిన్ అన్నాడు. దర్శకుడు వెంకీ నాకు పెద్ద ఫ్యాన్ అంట! అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి వెంకీ ఈ సినిమాని తీశాడు. నాకు మళ్లీ దిల్, సై తరవాత మళ్లీ అలాంటి యాంగిల్‌లో నన్ను చూపించాడు. ఇక ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న డాన్స్ ఈ సినిమాలో చేశాను. మళ్లీ జానీ మాస్టర్ సాంగ్ అనగానే నా బెండు తీస్తాడని తన డాన్స్ గురించి చెప్పుకొచ్చాడు" నితిన్..


ఇక సినిమా విషయం పక్కన పెట్టి పర్సనల్ విషయాల గురించి చెప్పుకొచ్చాడు నితిన్.. " నా లైఫ్‌లో పంచ ప్రాణాలు.. అమ్మ, నాన్న, అక్క, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అని ఇప్పుడు నాకు పెళ్లికాబోతోంది కాబట్టి తను నాకు ఆరో ప్రాణం షాలిని అని, నా జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తులు ఈ ఆరుగురేనని నితిన్ చెప్పుకొచ్చాడు. ఇక త్రివిక్రమ్ గారితో పరిచయం, ఆయనతో 'అ ఆ' సినిమా చేయడం ఓ అదృష్టంగా భావిస్తానని, ఆయన నాకొక టార్చ్ బేరర్ అని నితిన్ వెల్లడించాడు. ఇక ఈ సినిమాకి మెలోడి బ్రహ్మ మణిశర్మ కుమారుడు మహతి స్వర సాగర్ సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్ విభిన్నమైన కథలను తెరకెక్కించే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమాని, తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రంలో నటిస్తున్నాడు. రంగ్ దే చిత్రంలో నితిన్ కి జోడిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు పిక్స్ అయ్యాడు నితిన్.. ఈ సినిమాలు వచ్చే సంవత్సరంలో విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories