రివ్యూ : అర్జున్ సురవరం

రివ్యూ : అర్జున్ సురవరం
x
అర్జున్ సురవరం రివ్యూ
Highlights

హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా కెరియర్ ని మొదలు పెట్టాడు నిఖిల్.. ప్రారంభంలో కొన్ని ప్లాపులు వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ గాడిన పడ్డాడు.

హ్యాపీ డేస్ సినిమాతో హీరోగా కెరియర్ ని మొదలు పెట్టాడు నిఖిల్.. ప్రారంభంలో కొన్ని ప్లాపులు వచ్చినప్పటికీ ఆ తర్వాత మళ్ళీ గాడిన పడ్డాడు.. స్వామిరారా సినిమా తర్వాత నుంచి నిఖిల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది అని చెప్పుకోవాలి.. ఆ తరవాత వచ్చిన కార్తికేయ.. ఎక్కడికిపోతావు చిన్నవాడా లాంటి సినిమాలు వచ్చి మంచి విజయాన్ని సాధించాయి.. ఈ తరుణంలో నిఖిల్ నుండి సినిమా వస్తుందంటే ప్రేక్షకులలో ఎదో ఒక పాయింట్ ఉంటుంది అన్న ఎగ్జైట్ ని క్రియేట్ చేస్తూ వస్తున్నాడు.. అందులో భాగంగానే ఈరోజు అర్జున్ సురవరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది..

కథ:

జర్నలిజం మీద ఉన్న ఇంట్రెస్ట్ తో నాన్నకి సాఫ్ట్ వెర్ జాబ్ చేస్తున్నాను అని చెప్పి ఓ లోకల్ ఛానల్ లో జాయిన్ అవుతాడు అర్జున్ ( నిఖిల్ ).. ఆ తరవాత బీబీసీ లో జాబ్ కొట్టడం అతని ధ్యేయం.. ఈ తరుణంలో అతనికి కావ్య ( లావణ్య త్రిపాఠి)తో పరిచయం ఏర్పడుతుంది. అలా కావ్యతో బీబీసీ నుండి ఆఫర్ వస్తుంది అర్జున్ కి.. ఇక తన కల నెరవేరింది అనుకున్న టైంలో ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసం చేశాడన్న నేపథ్యంతో అర్జున్ ని అరెస్ట్ చేస్తారు పోలీసులు.. ఇంతకీ అర్జున్ అందులో ఎలా ఇరుక్కున్నాడు.. దానినుండి ఎలా బయటపడ్డాడు అన్నది మిగిలిన కథ..

ఎలా ఉందంటే?

ఫేక్ సర్టిఫికెట్ లను సాధించి సమాజంలో ఇంజినీర్లు, డాక్టర్లుగా మారి సమాజానికి ఎలాంటి కీడు చేస్తున్నారన్న పాయింట్ ని చాలా చక్కగా ఎలివేట్ చేశాడు దర్శకుడు.. సినిమ తమిళ్ సినిమాకి రీమేక్ అయినప్పటికీ ఎక్కడ కూడా ఆ తాలూకు రిఫరెన్స్ కనిపించకుండా తెలుగు నేటివిటితో చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు దర్శకుడు.. మొదటి అర్ధం భాగం బోరింగ్ సన్నివేశాలతో లాగించినప్పటికి ఆ తరవాత కథలో వేగం పుంజుకుంటుంది.. వరుస ట్విస్టులును పెట్టి సినిమాపైన అటెన్షన్ ని క్రియేట్ చేశాడు దర్శకుడు.. ఇక రెండవభాగంలో కథ గమనం తగ్గుతుంది. విలన్ లతో ఛేజింగ్ సన్నివేశాలు ఓవర్ సినిమాటిక్ గా అనిపిస్తాయి.. ఇక స్కామ్ వెనుక ఉన్న వారి కోసం అర్జున్ చేసే ప్రయత్నాలు కొత్తగా అనిపించావు.. ఇప్పటికే ఇలాంటివి చాలా సినిమాల్లో చూసాం అన్న భావన కలిగుతుంది. ఇక మళ్లీ ప్రీ క్లైమాక్స్ సినిమాకి హైలెట్ గా నిలిచింది.. ఎమోషన్ సీన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి..

నటీనటులు..

నిఖిల్ ఎంత మంచి నటుడో పెద్దగా చెప్పాల్సిన పనిలేదు.. గత సినిమాల మాదిరిగానే అదరగొట్టాడు.. అర్జున్ పాత్రకి వందకి వంద శాతం న్యాయం చేశాడు. సినిమాని తన భుజాలపైన వేసుకొని నడిపించాడు.. ఇక కావ్య పాత్రలో లావణ్య పర్వాలేదు అనిపించింది.. కానీ పెద్ద ప్రాముఖ్యం ఉన్న పాత్ర అయితే కాదు.. ఇక పోసాని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళీ తదితరులు పాత్రల మేరకు ఒకే అనిపించారు..

సాంకేతిక నిపుణులు...

ఇక సాంకేతిక నిపుణుల విషయానికి వచ్చేసరికి సినిమాటోగ్రఫీ సినిమాకి బాగా ప్లస్ అయింది.. యాక్షన్ సన్నివేశాలను బాగా చిత్రీకరీంచారు. ఇక శ్యామ్ అందించిన సంగీతం, నేపధ్య సంగీతం బాగుంది. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి..

ట్రైలర్ లో మైంటైన్ చేసిన ఉత్కంఠని సినిమాలో కూడా మైంటైన్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.. అక్కడక్కడ బోర్ కొట్టిన ప్రేక్షకుడిని మెప్పించడంలో అర్జున్ సురవరం పాస్ మార్కులు కొట్టేసింది..

గమనిక : ఈ సినిమా పై సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే ఇది. ఇది ఆ సమీక్షకుడి వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. సినిమా థియేటర్ లో చూడగలరు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories