అలాంటివాడినే పెళ్లి చేసుకుంటా : నిధి అగర్వాల్

అలాంటివాడినే పెళ్లి చేసుకుంటా : నిధి అగర్వాల్
x
Highlights

పెళ్లి విషయంలో ఎవరి క్లారిటీ వారికీ ఉంటుంది. పెళ్లి చేసుకునే వ్యక్తి అలా ఇలా ఉండాలని కొన్ని లెక్కలు ఉంటాయి. ఇక అందులో అమ్మాయిల విషయంలో మరీనూ.. అయితే...

పెళ్లి విషయంలో ఎవరి క్లారిటీ వారికీ ఉంటుంది. పెళ్లి చేసుకునే వ్యక్తి అలా ఇలా ఉండాలని కొన్ని లెక్కలు ఉంటాయి. ఇక అందులో అమ్మాయిల విషయంలో మరీనూ.. అయితే తనని పెళ్లి చేసుకునే వాడు ఇలా ఉండాలని అంటుంది నిధి.. సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ బ్యూటి .. తాజాగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్టు కొట్టింది.

మంచు లక్ష్మి వాఖ్యాతగా వ్యవహరిస్తున్నా 'ఫీటప్ విత్ స్టార్స్' అనే కార్యక్రమంలో పాల్గొంది నిధి.. ఇందులో తన పర్సనల్ విషయాలకి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించింది. నీకు ఎలాంటి భర్త కావలని అనుకుంటున్నావు అని అడగగా తనకు రాముడి లాంటి వ్యక్తి జీవిత భాగస్వామగా కావాలని తన మనసులో మాటను బయటపెట్టింది నిధి . తన జీవితంలో కృష్ణులాంటి వాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పుకొచ్చింది.

ఇక ఇంట్లో ఉండి పిజ్జాలు తీనుకుంటూ సినిమాలు చూడడం ఇష్టమని చెప్పుకొచ్చింది నిధి.. ఇస్మార్ట్ శంకర్ సినిమా సక్సెస్ తరవాత చాలా సినిమా ఆఫర్స్ వస్తున్నప్పటికీ మంచి కథల కోసం వెయిట్ చేస్తుంది నిధి..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories