మలుపులు తిరుగుతున్న రాజ్‌తరుణ్ యాక్సిడెంట్ కేస్

మలుపులు తిరుగుతున్న రాజ్‌తరుణ్ యాక్సిడెంట్ కేస్
x
Highlights

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసు మరో మలుపు తిరిగింది కారు యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ వీడియోలను కాస్టూమ్ డిజైనర్ కార్మీక్ వీడియోలు తీశాడు. అయితే వీడియోలు డిలీట్ చేయాలని తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కార్తీక్ మీడియా ముందుకు వచ్చాడు.

రాజ్ తరుణ్ యాక్సిడెంట్ కేసు మరో మలుపు తిరిగింది కారు యాక్సిడెంట్ తరువాత రాజ్ తరుణ్ వీడియోలను కాస్టూమ్ డిజైనర్ కార్మీక్ వీడియోలు తీశాడు. అయితే వీడియోలు డిలీట్ చేయాలని తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ కార్తీక్ మీడియా ముందుకు వచ్చాడు. ఈ క్రమంలో రాజ్ తరుణ్ వీడియోలు డిలీట్ చేయాలని రాజా రవీంద్ర, మరో మహిళ తనపై ఒత్తిడి తెచ్చారంటూ రెండు ఆడియోటేపులను విడుదల చేశాడు.

మరోవైపు కార్తీక్ చెపుతున్న దాంట్లో వాస్తవం లేదంటున్నారు ఆర్టిస్ట్ రాజా రవీంద్ర రాజ్ తరుణ్ వీడియోలతో తమని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అంటూ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో రాజా రవీంద్ర ఫిర్యాదు చేశారు. రాజ్ తరుణ్ కెరియర్ నాశనం అవుతుందని కార్మీక్ ను వీడియోలు డిలీట్ చేయమన్నామని మూడు లక్షలు ఇస్తామన్నా అతను ఒప్పుకోలేదని రాజా రవీంద్ర పేర్కొన్నారు. అతను అడిగినంత డబ్బు ఇవ్వలేదని కార్తీక్ వీడియోలు రిలీజ్ చేశాడని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయ పరంగా ముందుకెళ్తామని రాజారవీంద్ర పేర్కొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories