దీపావళి కొత్త సినిమా పోస్టర్ లపై ఓ లుక్కేయండి.. !

దీపావళి కొత్త సినిమా పోస్టర్ లపై ఓ లుక్కేయండి.. !
x
Highlights

ప్రతి పండగకు కొత్త సినిమాకి సంబధించిన ఎదో ఒక అప్డేట్ ని ఇవ్వడం తెలుగు చిత్ర పరిశ్రమకి మొదటినుండి వస్తున్న సంప్రదాయం.. అలాగే ఈ దీపావళి కూడా...

ప్రతి పండగకు కొత్త సినిమాకి సంబధించిన ఎదో ఒక అప్డేట్ ని ఇవ్వడం తెలుగు చిత్ర పరిశ్రమకి మొదటినుండి వస్తున్న సంప్రదాయం.. అలాగే ఈ దీపావళి కూడా ప్రేక్షకులకి శుభాకాంక్షలు చెబుతూ కొన్ని కొత్త సినిమాలకి సంబధించిన కొత్త పోస్టర్లను విడుదల చేసారు. అవేంటో చూసేద్దాం..

1. సరిలేరు నికేవ్వరు

మహేశ్ బాబు హీరోగా నటిస్తున్నా తాజా చిత్రం సరిలేరు నికేవ్వరు.. ఈ దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ మొత్తం మూడు కొత్త పోస్టర్లను విడుదల చేసింది. అందులో ఒకటి లేడి అమితాబ్ విజయశాంతి కాగా మరొకటి మహేష్ బాబు కొత్త లుక్ మరియు హీరోయిన్ రష్మిక లుక్ ని విడుదల చేసారు .. ఈ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.




2. అల వైకుంటపురములో

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది.. ఈ దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ "రాములో రాములా " అంటూ కొత్త పాటను విడుదల చేస్తూ ఓ ఫ్యామిలీ ఫోటోను కూడా రిలీజ్ చేసింది.


3. భీష్మ

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ,రష్మిక మందన్నా హీరో , హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం భీష్మ.. ఈ దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ రొమాంటిక్ లుక్ ని విడుదల చేసింది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఫిబ్రవరి14న విడుదల చేయనున్నారు.


4. డిస్కో రాజా

మాస్ రాజా రవితేజ హీరోగా వి.ఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం డిస్కో రాజా.. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ దీపావళి సందర్బంగా ఓ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం..


5. సూపర్ మచ్చి

విజేత సినిమా తర్వాత చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సూపర్ మచ్చి.. పులివాసు దర్శకత్వం వహిస్తున్నారు . ఈ సినిమాకి సంబధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. రియా హీరోయిన్ గా నటిస్తుంది.

6. ఎంత మంచివాడవురా

కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ విగ్నేశ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఎంత మంచివాడవురా.. మేహరీన్ కథానాయకగా నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు . ఈ దీపావళి సందర్బంగా కుటుంబంతో కూడిన కొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


7. ప్రతిరోజు పండగే

సాయి ధరమ్ తేజ్, రాశి ఖన్నా హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న చిత్రం ప్రతిరోజు పండగే.. మారుతీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ దీపావళి సందర్బంగా చిత్ర యూనిట్ మొత్తం ఫ్యామిలీతో ఉన్న ఫోటోను రిలీజ్ చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories