అనసూయకు సారీ చెప్పిన నెటిజన్... డబుల్ స్టాండర్ట్ పార్ట్ 1 అన్న అనసూయ

అనసూయకు సారీ చెప్పిన నెటిజన్... డబుల్ స్టాండర్ట్ పార్ట్ 1 అన్న అనసూయ
x
యాంకర్ అనసూయ
Highlights

సినీతారలను నెటిజన్లు ట్రోల్స్ చేయడం అనేది కామన్.. దీనిని కొందరు లైట్ తీసుకుంటే మరి కొందరు మాత్రం సీరియస్ గా తీసుకొని తగిన జవాబు ఇస్తారు.

సినీతారలను నెటిజన్లు ట్రోల్స్ చేయడం అనేది కామన్.. దీనిని కొందరు లైట్ తీసుకుంటే మరి కొందరు మాత్రం సీరియస్ గా తీసుకొని తగిన జవాబు ఇస్తారు. అందులో భాగంగానే ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయకి ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఎప్పటికప్పుడు తనకి సంబధించిన అప్డేట్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది అనసూయ. ఈ నేపధ్యంలో తాజాగా అనసూయ రెడ్ బ్లౌజ్, వైట్ శారీలో దిగిన కొన్ని ఫోటోల్ని తన సోషల్ మీడియా పేజీల్లో పోస్టు చేసింది.

అయితే దీనిపైన ఓ నెటిజన్ స్పందిస్తూ 'అనసూయ గారు మీకు పెళ్లైంది... మీకు ఇవన్నీ అవసరమా ? ' అంటూ ప్రశ్నిస్తూ రిప్లై ఇచ్చాడు. అయితే దీనిపైన అనసూయ రిప్లై ఇచ్చింది. జగదీష్ గారు మీకు బుర్రలేదు మీకు ఇలా నాతో మాట్లాడటం అవసరమా చెప్పండి అంటూ కౌంటర్ వేసింది. అనసూయ ఇచ్చిన కాంటర్ కి మిగతా నెటిజన్లు కూడా సపోర్ట్ చేయడం విశేషం.

అయితే అనసూయ వేసిన కౌంటర్ కి మెత్తబడ్డ నెటిజన్... సారీ అనసూయ గారూ అంటూ మరో ట్వీట్ పోస్టు చేశాడు. మీరు స్పందించాలనే అలా కామెంట్లు పెట్టానని, అలా చేసి మిమ్మల్ని బాధపెట్టాను సారీ అంటూ పోస్టు చేశాడు. అంతకుముందు అనసూయను విమర్శిస్తూ పెట్టిన ట్వీట్ కూడా ఆ నెటిజన్ డిలీట్ చేశాడు. అయితే దీనిపైన అనసూయ సందిస్తూ 'డబుల్ స్టాండర్ట్ పార్ట్ 1' అంటూ రీట్వీట్ చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories