తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట

తెలుగు సినిమాలకు జాతీయ అవార్డుల పంట
x
Highlights

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని...

ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకు ముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందజేశారు.

66 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఈసారి తెలుగు సినిమా తన సత్తాను చాటింది. ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ నటి అవార్డులను మహానటి చిత్రం గెలుచుకుంది. ఉత్తమనటిగా కీర్తి సురేష్ ఎంపికైంది. ఉత్తమ స్క్రీన్ ప్లే తో పాటు వివిధ కేటగిరిలో తెలుగు సినిమాలు సత్తా చాటాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం బెస్ట్ సౌండ్ మిక్సింగ్ విభాగంలో అవార్డు పొందింది. రాధాకృష్ణ ఈ అవార్డు దక్కించుకున్నారు. అక్కినేని సుమంత్ హీరోగా నటించిన చిలసౌ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో అవార్డు రాగా, స్పెషల్ ఎఫెక్ట్, మేకప్ కోటాలో 'అ!' సినిమా అవార్డులు దక్కించుకుంది.

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన మహానటి మూడు విభాగాల్లో అవార్డులు దక్కించుకుంది. ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ కాస్ట్యూమ్స్ విభాగాల్లో అవార్డులు లభించాయి. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తి సురేశ్ ఉత్తమనటిగా నిలిచారు. అలనాటి తార సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్‌ టైటిల్‌రోల్‌ పోషించారు. సమంత, విజయ్‌దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌లు కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంది.

జాతీయ పురస్కారాలు

ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా (అంధాధున్‌)

* ఉత్తమ నటి: కీర్తిసురేశ్‌(మహానటి)

* జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌

* జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి

* జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌

* జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌

* ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌)

* జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌

* ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

* ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి||ల||సౌ||

* ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: 'అ!'(తెలుగు)కేజీఎఫ్‌(కన్నడ)

* ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)

* ఉత్తమ మేకప్‌: 'అ!'

* ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి

* ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)

* ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)

* ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి

* ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ప్లే: అంధాధున్‌

* ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాళీ)

* ఉత్తమ గాయని: బిందుమలినిఫ్‌(నాతి చరామి: మాయావి మానవే)

* ఉత్తమ గాయకుడు: అర్జిత్‌సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)

* ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌, షాహిబ్‌ సింగ్‌, తలాహ్‌ అర్షద్‌ రేసి, శ్రీనివాస్‌ పోకాలే

Show Full Article
Print Article
More On
Next Story
More Stories