హ్యాట్సాఫ్! చిరంజీవిగారు : నారా లోకేష్

హ్యాట్సాఫ్! చిరంజీవిగారు : నారా లోకేష్
x
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా.. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకుల నుండి మరియు సినీ తారల నుండి...

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా.. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకుల నుండి మరియు సినీ తారల నుండి మంచి స్పందన వస్తుంది. తాజాగా ఈ సినిమా గురించి టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందిచారు. "తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా 'సైరా'. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు" అంటూ చిరుని ఆకాశానికి ఎత్తేశారు లోకేష్.. అంతే కాకుండా ఎంతో పరిశ్రమించి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్ చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డికి, సాంకేతిక సిబ్బంది మరియు యూనిట్ మొత్తానికీ హార్దికాభినందనలు తెలిపారు లోకేష్.. సైరా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా,నయనతార నటించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories