logo
సినిమా

బాలయ్య తో రొమాన్స్ చేయనున్న నాని హీరోయిన్

బాలయ్య తో రొమాన్స్ చేయనున్న నాని హీరోయిన్
X
Highlights

శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'చెలియా' సినిమాలో...

శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఈమె మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన 'చెలియా' సినిమాలో కనిపించింది. అలాగే కన్నడలో 'యూటర్న్' సినిమాతో పాపులర్ అయిన శ్రద్ధ శ్రీనాథ్ ఇప్పుడు నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న 'జెర్సీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. స్పోర్ట్స్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా లో నాని క్రికెటర్ పాత్రలో మనకు కనిపించనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుంది.

ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు కానీ అప్పుడే ఈ భామ టాలీవుడ్ లోనే మరొక పెద్ద ఆఫర్ ను చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్యనే 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తవగానే బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో పట్టాలెక్కనుంది.

Next Story