రాక్షసుడిగా నాని వచ్చేసాడు

రాక్షసుడిగా నాని వచ్చేసాడు
x
Highlights

విభిన్నమైన చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వి' .. ఈ సినిమాలో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటిస్తుండగా,...

విభిన్నమైన చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'వి' .. ఈ సినిమాలో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటిస్తుండగా, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.

హీరో నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం..దాదాపుగా షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని ఉగాది కానుకగా విడుదల చేయనున్నారు. సినిమా విడుదల తేది దగ్గరపడుతుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల నిన్న హీరో సుధీర్ బాబు లుక్ ని విడుదల చేసింది చిత్రబృందం. రక్షకుడిగా అయన లుక్ అదిరిపోయింది. ఇందులో సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ రోజు హీరో నానికి సంబంధించిన లుక్ ని రిలీజ్ చేశారు.

ఇందులో నాని ఫుల్ గడ్డంతో రఫ్ లుక్ లో, చేతిలో కత్తెర అలాగే చేయి మీద నుండి కారుతున్న బ్లడ్ తో యాక్షన్ లుక్ తో కనిపిస్తున్నాడు. ఇంతవరకు కనిపించని నాని ఈ లుక్ లో కనిపిస్తున్నాడని చెప్పాలి. ఇక నాని, సుదీర్ బాబుకి మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలవన్నున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ పనులతో బిజీగా ఉన్న ఉగాది సంద‌ర్భంగా మార్చి25న విడుద‌ల చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories