క్రిష్ ఊరికే అన్నాడా లేక నిజంగా చేస్తాడా?

గత కొంత కాలంగా నందమూరి అభిమానులు అందరూ నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ లో ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ లాంచ్ పై ఇప్పటికే చాలా పుకార్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి.
గత కొంత కాలంగా నందమూరి అభిమానులు అందరూ నందమూరి బాలకృష్ణ తనయుడు అయిన నందమూరి మోక్షజ్ఞ హీరోగా టాలీవుడ్ లో ఎప్పుడు ఇస్తాడా అని ఎదురు చూస్తున్నారు. మోక్షజ్ఞ లాంచ్ పై ఇప్పటికే చాలా పుకార్లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా షూటింగ్ అప్పటినుండి, దర్శకుడు క్రిష్ మోక్షజ్ఞను టాలీవుడ్ లో హీరోగా లాంచ్ చేయనున్నారు అని టాక్ ఏర్పడింది. అది ఎన్టీఆర్ బయోపిక్ వరకు ఇంకా అలా కొనసాగుతూనే ఉంది. ఎన్టీఆర్ బయోపిక్ ప్రమోషన్స్ కోసం క్రిష్ మరియు బాలకృష్ణ 'నెంబర్ 1 యారి' కి వచ్చిన సంగతి తెలిసిందే. కనీసం ఇందులో అయినా ఒక క్లారిటీ ఇస్తారేమో అని ఎదురు చూస్తే ఆ పుకార్లకు ఆజ్యం పోసినట్లయింది.
మోక్షజ్ఞ, బాలకృష్ణ నటించిన 'ఆదిత్య 369' సీక్వెల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడు అని వార్తలు మనం విన్నాం. కొన్ని కారణాల వల్ల సినిమా అటకెక్కింది అని టాక్. అయితే 'నంబర్ వన్ యారి' షో లో రానా క్రిష్ ను ఒక బాలయ్య సినిమాను మోక్షజ్ఞ తో రీమేక్ చేయాలి అనుకుంటే ఏ సినిమాలో చేస్తారు అని అడగగా క్రిష్ వెంటనే 'ఆదిత్య369' చెప్పారు. 1991లో సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే క్రిష్ కేవలం మాటలతో సరిపెడతాడా లేక నిజంగానే మోక్షజ్ఞ తో 'ఆదిత్య369' కు సీక్వెల్ తీస్తాడు అనేది వేచి చూడాల్సిందే.
రాబోయే ఎన్నికల్లో ఆ ఆరుగురు గట్టెక్కేదెలా?
27 May 2022 9:30 AM GMTతెలంగాణ కాంగ్రెస్‌లో నాలుగు ముక్కలాట.. నాలుగు ముక్కలాటతో క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోందా?
27 May 2022 8:30 AM GMTAtmakur By Election: మేకపాటి ఫ్యామిలీకి షాకిచ్చిన మేనల్లుడు
27 May 2022 7:30 AM GMTశ్రీకాకుళం టీడీపీలో బాబాయ్ Vs అబ్బాయ్
27 May 2022 6:30 AM GMTకుక్కతో స్టేడియంలో వాకింగ్ చేసిన ఐఏఎస్ దంపతుల బదిలీ
27 May 2022 5:48 AM GMTMahbubnagar: ఓ పల్లెను సర్వ నాశనం చేసిన పల్లెప్రగతి పథకం
26 May 2022 3:00 PM GMTయుద్ధానికి సిద్ధం.. కాస్కో కేసీఆర్ అన్నట్లు సాగిన మోడీ ప్రసంగం
26 May 2022 11:30 AM GMT
నిఖత్ జరీన్‌కు హైదరాబాద్ లో ఘన స్వాగతం
27 May 2022 4:00 PM GMTముగిసిన కేటీఆర్ దావోస్ టూర్.. తెలంగాణకు రూ.4,200 కోట్ల పెట్టుబడులు..
27 May 2022 3:45 PM GMTLPG Subsidy: గ్యాస్ వినియోగదారులకి అలర్ట్.. అకౌంట్లో సబ్సిడీ చెక్...
27 May 2022 3:30 PM GMTనారా లోకేష్ సంచలన నిర్ణయం.. వాళ్లకు నో టికెట్స్.. నేనూ పదవి నుంచి...
27 May 2022 3:30 PM GMTWrinkles: 30 ఏళ్ల తర్వాత ముడతలు రావొద్దంటే ఈ చిట్కాలు పాటించండి..!
27 May 2022 2:30 PM GMT