రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానిగా మారిపోయిన బాలయ్య

రూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానిగా మారిపోయిన బాలయ్య
x
balakrishna
Highlights

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం రూలర్.. కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రకరణ పూర్తి...

నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం రూలర్.. కేయస్ రవికుమార్ దర్శకత్వం వహించగా, సీ కళ్యాణ్ ఈ సినిమాని నిర్మించారు. ఇప్పటికే చిత్రకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ ఈ రోజు విశాఖలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా నిర్వహిస్తుంది, అయితే ఈ వేడుకలో హీరో బాలకృష్ణ ఓ అభిమానిగా మారిపోయి చాలా సందడి చేశారు. వేడుకలో బాగంగా హీరోయిన్స్ అయిన సోనాలి చౌహాన్, వేదికలను స్టేజీ పైకి యాంకర్ ఝాన్సీ పిలువగా బాలయ్య మాత్రం ఓ అభిమానిలాగా నోటికి చేతులు అడ్డం పెట్టికొని అరుస్తూ కనిపించారు.

ఇక ఈ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ .. "తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనాన్ని ఆదరిస్తారు. నా అభిమానులు ఉండగా, నేను ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో చేస్తానని అన్నారు. గతంలో మా దర్శకుడు కే, యస్ రవికుమార్, నిర్మాత సీ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన జై సింహాను సక్సెస్ చేశారు. మీరిచ్చిన ప్రోత్సాహంతోనే ఇప్పుడు రూలర్ సినిమాని తీశాం. ముందుకు ఈ సినిమాకి వేరే కథ అనుకున్నామని, కానీ అనివార్య కారణాల వల్ల ఆ కథను పక్కన పెట్టి ఈ రూలర్ అనే సినిమాని తీశామని చెప్పుకొచ్చాడు. వైజాగ్ కి నాకు ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు" తెలిపారు.

ఇక హీరో రాజశేఖర్ మాట్లాడుతూ నేను కేవలం బాలకృష్ణ కోసమే ఇక్కడికి వచ్చానని, నేను ఇండస్ట్రీకి వచ్చాక నన్ను ప్రోత్సహించిన వారిలో బాలకృష్ణ కచ్చితంగా ఉంటారని అన్నారు. ఆయనొక రూలర్ .. ఇప్పుడు అయన మరో రూలర్ తో రావడం అద్భుతం అన్నారు. ఎప్పుడు సంక్రాంతికి వచ్చి రూల్ చేసే బాలకృష్ణ ఇప్పుడు సంక్రాంతికి ముందే వచ్చి అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టడానికి వస్తున్నాడని చెప్పుకొచ్చారు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories