రూలర్ టిజర్ వచ్చేసింది

Ruler Official Teaser
x
Ruler Official Teaser
Highlights

ముఖ్యంగా "ఒంటి మీదా ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా బయటకు వచ్చిన సింహంలా ఆగను"

బాలకృష్ణ కథానాయకుడుగా నటిస్తున్న తాజా చిత్రం రూలర్.. కేయస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని సీకే ఎంటర్టైన్మెంట్ పై సీ కళ్యాణ్ నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ సినిమాకి సంబంధించిన చిత్ర టిజర్ ని గురువారం సాయింత్రం బయటకు వదిలింది. ఇందులో బాలకృష్ణ పోలీస్ పాత్రలో , మరో స్టైలిష్ పాత్రలో కనిపిస్తూ ఆదరగోడుతున్నాడు.

చిత్ర టిజర్ లో బాలకృష్ణ చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా "ఒంటి మీదా ఖాకీ యూనిఫాం ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫాం తీశానా బయటకు వచ్చిన సింహంలా ఆగను" అన్న డైలాగ్ ప్రేక్షకులను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి.

ఈ సినిమాలో బాలకృష్ణకి జోడిగా వేదిక, సోనాలి చౌహాన్ నటిస్తుండగా భూమిక, ప్రకాష్ రాజ్ ఓ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా సినిమాని డిసెంబర్ 20 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories