అలా ఎందుకన్నానబ్బా? నాగ్ ను ఇబ్బంది పెడుతున్న వ్యాఖ్యలు

అలా ఎందుకన్నానబ్బా? నాగ్ ను ఇబ్బంది పెడుతున్న వ్యాఖ్యలు
x
Highlights

అయ్యో.. అలా అనకుండా ఉండాల్సిందే అనుకునేలా ఉంది ఇపుడు నాగార్జున పరిస్థితి. బిగ్ బాస్ 3 కి నాగార్జున హోస్ట్ అనే విషయం స్పష్టమైపోయింది. బిగ్ బాస్ అంటేనే...

అయ్యో.. అలా అనకుండా ఉండాల్సిందే అనుకునేలా ఉంది ఇపుడు నాగార్జున పరిస్థితి. బిగ్ బాస్ 3 కి నాగార్జున హోస్ట్ అనే విషయం స్పష్టమైపోయింది. బిగ్ బాస్ అంటేనే సోషల్ మీడియాలో ఓ రకమైన అలజడి ప్రారంభం అయిపోతుంది. ట్రోలింగ్ మొదలైపోతుంది. గత సీజన్ లో అయితే, ఈ ట్రోలింగ్ వ్యక్తిగత దూషణల వరకూ వెళ్ళింది. ఆ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించిన నానీ అయితే ఆ ట్రోలింగ్ దెబ్బకు మళ్లీ ఇటువంటి షో వైపు చూడలేనంత విసిగిపోయారు. ఇపుడు ఆ ట్రోల్స్ ఎలా ఉంటాయో.. ఒక్క టీజర్ తోనే నాగార్జునకు అర్థం అయిపోయింది. నేట్టింట్లో జనాలు ఎంతగా సెలబ్రిటీలను గమనిస్తూ ఉంటారనే విషయం స్పష్టంగా తెలిసి వచ్చింది.

ఇంతకీ విషయం ఏమిటంటే.. అప్పట్లో నాగార్జునని బిగ్ బాస్ షో పై అభిప్రాయం అడిగితె..అబ్బే అది అసలు నాకు నచ్చదని చెప్పారు. కొంత మంది వ్యక్తులను ఒక చోట ఉంచి వారు ఏం చేస్తున్నారో దొంగ చాటుగా చూడటం అనేది గాసిప్ తో సమానం అన్నట్లుగా గతంలో నాగార్జున అభిప్రాయ పడ్డారు. అదిగో సరిగ్గా ఈ మాటలనే నెటిజన్లు తెగ వాడేసుకుని ఆడేసు కుంటున్నారు. బిగ్ బాస్ పై ఇంతటి చెడు అభిప్రాయం ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలా ఆ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తాడు అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. కొందరు నాగ్ కు సపోర్ట్ చేస్తున్నారు. నాగార్జున గతంలో అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా బిగ్ బాస్ గురించి కామెంట్స్ చేసి ఉంటాడని.. ఇప్పుడు ఆయనకు హోస్టింగ్ ఛాన్స్ వచ్చింది కనుక తప్పకుండా ఆయన మళ్లీ తన మనసు మార్చుకుని బిగ్ బాస్ పై సదాభిప్రాయంకు వస్తాడని వారు ఆశిస్తున్నారు.

అందుకే మరి పెద్దోళ్లు నోరు జాగ్రత్త అంటుంటారు. ఇపుడు ఇదే విషయం కింగ్ నాగ్ కూ అర్థం అయివుంటుంది. అంతేగా..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories