తాత కాబోతున్న నాగార్జున..!

తాత కాబోతున్న నాగార్జున..!
x
Highlights

టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నారు. అయితే అది రియల్‌ లైఫ్‌లో మాత్రం కాదులెండి.. రీల్ లైఫ్‌లోనే. అవును నాగార్జున తన తదుపరి చిత్రంలో తాత...

టాలీవుడ్ కింగ్ నాగార్జున త్వరలో తాత కాబోతున్నారు. అయితే అది రియల్‌ లైఫ్‌లో మాత్రం కాదులెండి.. రీల్ లైఫ్‌లోనే. అవును నాగార్జున తన తదుపరి చిత్రంలో తాత పాత్రలో కనిపించనున్నాడని ఫిలిం నగర్లో వార్త చక్కర్లు కొడుతోంది. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు ప్రీక్వల్‌ను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నారు నాగార్జున, నాగచైతన్య. దర్శకుడు కురసాల కల్యాణ్ కృష్ణ చెప్పిన కథ నచ్చటంతో నాగార్జున, నాగచైతన్య లు కలిసి నటించడానికి ఒకే చెప్పేశారట.

దాంతో త్వరలోనే సినిమాను ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడట కళ్యాణ్ కృష్ణ. ఈ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కే తాతగా కనిపించనున్నాడట. బంగార్రాజు అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశముంది. కాగా దేవదాసు సినిమా తరువాత కొంత గ్యాప్‌ తీసుకున్న నాగ్‌, బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త్రతో పాటు మరో మలయాళం సినిమాలో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories