కరెన్సీ నోట్ల మీదా వారి ఫోటోలను కూడా చూడాలని ఉంది: నాగబాబు

కరెన్సీ నోట్ల మీదా వారి ఫోటోలను కూడా చూడాలని ఉంది: నాగబాబు
x
Nagababu(File photo)
Highlights

ప్రముఖ నటుడు నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు.

ప్రముఖ నటుడు నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు.తాజాగా గాంధీని చంపిన గాడ్సే నిజమైన దేశభక్తుడు అని ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు నాగబాబు. దీనితో ఈ ట్వీట్ వైరల్ మారింది. నాగబాబు చేసిన ఈ వాఖ్యాలపైన కొందరు నాగబాబు మద్దతిచ్చినప్పటికీ, మరికొందరు మాత్రం వ్యతిరేకించారు. ముఖ్యంగా గాంధేయవాదులు మాత్రం నాగబాబుపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అంతేకాకుండా నాగబాబు పై పోలిస్ స్టేషన్ లో సైతం కేసు నమోదు అయింది.

ఆ తరవాత దీనిపైన నాగబాబు దీనిపైన వివరణ ఇచ్చారు. దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోండని, నేను నాధురాం గురించి ఇచ్చిన ట్వీట్ లో నాధురాం చేసిన నేరాన్ని సమర్ధించలేదని, కేవలం నాధురాం వెర్షన్ కూడా జనానికి తెలియాలి అని మాత్రమే అన్నానని అన్నారు. నాకు మహాత్మ గాంధీ అంటే నాకు చాలా గౌరవమని, ఇన్ఫాక్ట్ నన్ను విమర్శించే వల్లకన్నా నాకు ఆయనంటే చాలా గౌరవమని నాగబాబు చెప్పుకొచ్చారు.

అయితే ఇక ఇది మరవకముందే.. మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు నాగబాబు.. ఇండియన్ కరెన్సీ నోట్ల మీద సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్, భగత్ సింగ్,చంద్రశేఖర్ ఆజాద్, లాల్ బహదూర్ ,పీవీ నరసింహారావు, అబ్దుల్ కలాం, సావర్కార్, వాజపేయ లాంటి మహానుభావుల చిత్రాలను కూడా చూడాలని ఉందని, ఎందుకంటే స్వతంత్ర భారత ఆవిర్భావానికి కృషి చేసిన మహానుభావులని జనము మర్చిపోకూడదని, ఒక ఆశ అని నాగబాబు పేర్కొన్నారు.

అంతేకాకుండా ఒకవేళ గాంధీ గారు బ్రతికి ఉంటే ఆయన కూడా తనతో పాటు దేశానికి సేవ చేసిన దేశభక్తులని గౌరవించమని తప్పకుండా చెప్పేవారని, దేశం కోసం జీవితాల్ని త్యాగం చేసిన మహానుభావుల పేర్లు తప్ప మొహాలు గుర్తు రావడం లేదని, భావితరాలకు కరెన్సీ నోట్ల పై వారి ముఖ పరిచయం చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని నాగబాబు పేర్కొన్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories