'నాగేశ్వర రావు' గా నాగచైతన్య

నాగేశ్వర రావు గా నాగచైతన్య
x
Highlights

యంగ్ హీరోలలో చాలా బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నాగచైతన్యననే.. గత ఏడాది మజీలీ, వెంకీ మామ లాంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో...

యంగ్ హీరోలలో చాలా బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే టక్కున గుర్తొచ్చే పేరు నాగచైతన్యననే.. గత ఏడాది మజీలీ, వెంకీ మామ లాంటి సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ అక్కినేని వారసుడు ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న ' లవ్ స్టొరీ' సినిమాలో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాని వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తుండడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత క్లాస్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమాని చేసేందుకు సిద్దం అయ్యాడు చైతూ.. ఈ సినిమాని 14 ప్లస్ నిర్మిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. సినిమాని త్వరలో సెట్స్ పైకి తీసుకువేల్తున్నారు. అయితే ఈ సినిమాకి 'నాగేశ్వర రావు' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. కథ పరంగా, చైతూ పాత్ర పరంగా ఇదే కరెక్ట్ టైటిల్ ని పరుశురాం భావిస్తున్నట్టు సమాచారం.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికని ఫిక్స్ చేసినట్టుగా సమాచారం. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ఇక ఎప్పటినుంచి అనుకుంటున్నా బంగార్రాజు సినిమాని కూడా త్వరలో పట్టాలేక్కించే పనిలో ఉన్నారు నాగ్ , చైతూ.. ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ సినిమా వాయిదాల మీద వాయిదా పడుతూ వస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాని త్వరలోనే పట్టలేక్కించే పనిలో ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో పతాకంపై నాగ్ ఈ సినిమాని నిర్మించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories