చైతూ వచ్చి పదేళ్ళు!

చైతూ వచ్చి పదేళ్ళు!
x
Highlights

అక్కినేని వారసుడిగా తెరంగ్రేటం నాగార్జున తనయుడిగా అభిమాన నీరాజనం పూలబాటపై తెలుగు చిత్ర సీమలో అడుగిడిన నాగచైతన్య దశాబ్ద చలన చిత్ర ప్రయాణాన్ని పూర్తి...

అక్కినేని వారసుడిగా తెరంగ్రేటం నాగార్జున తనయుడిగా అభిమాన నీరాజనం పూలబాటపై తెలుగు చిత్ర సీమలో అడుగిడిన నాగచైతన్య దశాబ్ద చలన చిత్ర ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు . తన వెనకున్న వారసత్వపు ఛాయలను చేరుపుకుంటూ పరిశ్రమలోని ఎత్తుపల్లాల మధ్య అలుపెరగని ప్రయాణం కొనసాగిస్తున్నాడు చైతూ ... తన రెండవ సినిమా సహనటి సమంతతో వైవాహిక బంధాన్ని ఏర్పర్చుకొని దిగ్విజయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నా అక్కినేని అబ్బాయి సినీ జీవితపు 'పద'నిసలు మీ కోసం ....

చైతూ దిల్ రాజ్ బ్యానర్ లో వచ్చిన జోష్ సినిమాతో చిత్రపరిశ్రమకి పరిచయం అయ్యాడు . ఈ సినిమా సెప్టెంబర్ 09 2009 ప్రేక్షకుల ముందుకు వచ్చింది . ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా చైతూ నటనకి మంచి మార్కులే వచ్చాయి ... ఇక లవ్ స్పెషలిస్ట్ గా పేరుపొందిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఎం మాయ చేసావే సినిమా చైతుకి తొలిహిట్టును అందించింది . అ తరావత 100% లవ్ , దడ, బెజవాడ, తడాక, మనం , ఆటో నగర్ సూర్య , ఒక లైలా కోసం , దోచేయ్, ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో , రారండోయ్ వేడుక చూద్దాం , యుద్ధం శరణం , శైలజ రెడ్డి అల్లుడు , సవ్యసాచి , మజిలి అనే చిత్రాలను చేసి నటుడుగా మంచి గుర్తింపు సాదించాడు .

చైతూ నటించిన సినిమాలను అన్నింటిని ఒక్కసారి పరిశీలిస్తే ఎక్కువగా లవ్ బేస్ గా వచ్చిన సినిమాలే మంచి హిట్లుగా లభించాయి . ప్రస్తుతం నాగ చైతన్య బాబీ దర్శకత్వంలో హీరో వెంకటేష్ తో కలిసి వెంకీ మామ అనే సినిమాని చేస్తున్నాడు . ఇది అయిపోయాక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు . ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories