Review 2019: ఆకట్టుకున్న సినిమాలు ఇవే !

Review 2019: ఆకట్టుకున్న సినిమాలు ఇవే !
x
Highlights

ఈ సంవత్సరంలో దాదాపు 100కి పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ సంవత్సరంలో దాదాపు 100కి పైగానే సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని ప్రేక్షకులను ఆకట్టుకోగా మరి కొన్ని సినిమాలు నిరాశపరిచాయి. ఈ సంవత్సరం ఆకట్టుకొని ప్రేక్షకులను అలరించిన చిత్రాల పై లుకేద్దాం

F2 :

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి బరిలో నిలిచి మంచి హిట్టు అయింది. ఈ సినిమానే 2019లో విజయం అందుకున్న తొలి చిత్రంగా నిలిచిపోయింది... ఫన్ & ఫ్రస్ట్రేషన్ అంటూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో తమన్నా, మెహ్రీన్‌లు కథానాయకలు గా నటించారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. వంద కోట్లకి పైగానే కలెక్షన్లను సాధించింది.

మజిలీ:

పెళ్లి తర్వాత అక్కినేని నాగ చైతన్య - సమంతలు కలిసి నటించిన చిత్రం 'మజిలీ'.. 2019 సమ్మర్ లో రిలీజైన ఈ సినిమా మంచి హిట్టు అయింది. సమంత, నాగ చైతన్య అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు.

చిత్రలహరి:

వరుస పరాజయాలతో కెరియర్ ని నెట్టుకొచ్చిన మెగా మేనల్లుడు సాయి ధరన్ తేజ్ కి ఈ సినిమా మంచి విజయాన్ని అందించింది. ఎప్పుడు అపజయాలు వెంటాడుతున్న విజయం కోసం పోరాడే ఓ యువకుడి పాత్రలో బాగా నటించాడు సాయి..ఈ సినిమా కూడా ప్రేక్షకులకు బాగానే కనెక్ట్ అయ్యింది. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు.

జెర్సీ:

విభిన్నమైన కథలు చేయడంలో నాని ఎప్పుడు ముందుంటాడు. అందులో భాగంగానే 'జెర్సీ' అనే సినిమాలో నటించి మెప్పించాడు. తండ్రీకొడుకుల మధ్య జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రద్దా శ్రీనాథ్ కథానాయకగా నటించింది. సినిమాకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయి సినిమా పైన ప్రశంసలు కురిపించారు. గౌతమ్ తిన్నానురి దర్శకత్వం వహించాడు.

మహర్షి:

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కిన మహర్షి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. వీకెండ్ వ్యవసాయం అన్న కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ,మహేష్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ:

ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా నవీన్ పోలిశెట్టి హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. చిన్న బడ్జెట్ తో పక్కా కథతో తెరకెక్కిన ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.

బ్రోచేవారెవరురా:

అంచనాలు లేకుండా వచ్చిన మరో చిత్రమిది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను బేస్ చేసుకొని మంచి కామెడీ ఆడ్ చేసి సినిమాని తెరకెక్కించారు. నివేతా థామస్, శ్రీ విష్ణు, ప్రియదర్శి. రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులోనే కథనమే ప్రేక్షకులను కట్టిపడేసింది.

ఇస్మార్ట్ శంకర్:

వరుస పరాజయాలతో సతమతమవుతున్న హీరో రామ్ , దర్శకుడు పూరి జగన్నాధ్‌ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రామ్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ఇస్మార్ట్ శంకర్' నిలిచింది. నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. మణిశర్మ సంగీతం అందించాడు.

ఎవరు:

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్టు అయిన సినిమాల్లో ఇదొకటి. సస్పెన్స్ కం థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలోని కథనం సినిమాకి బాగా ప్లస్ అయింది. అడివి శేష్, రెజీనా, నవీన్ కుమార్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

గద్దలకొండ గణేష్:

F2 లాంటి ఫ్యామిలీ హిట్టు తర్వాత మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన సినిమా ఇది. క్యారెక్టర్ బేస్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో వరుణ్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చాడనే చెప్పాలి. హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories