మహర్షికి మరిన్ని సీన్లు!

మహర్షికి మరిన్ని సీన్లు!
x
Highlights

మూడు గంటల సినిమా ఎక్కువైపోయింది బాబోయ్ అనుకుంటుంటే మరిన్ని సీన్లను జోడించాలని ప్లాన్ చేస్తున్నారంట మహర్షి టీం. సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. నిజమే....

మూడు గంటల సినిమా ఎక్కువైపోయింది బాబోయ్ అనుకుంటుంటే మరిన్ని సీన్లను జోడించాలని ప్లాన్ చేస్తున్నారంట మహర్షి టీం. సినిమా విజయవంతంగా దూసుకుపోతోంది. నిజమే. కానీ.. సినిమా మీద పూర్తి పాజిటివ్ టాక్ లేదనేదీ నిజమే. సినిమా నిడివిపై విమర్శకులు కూడా పలు విమర్శలు చేశారు. ప్రేక్షకులు కూడా కాస్త ట్రిమ్ చేసుంటే మరింత బాగుండేది అన్నారు. ముఖ్యంగా సినిమా రెండోసారి, మూడోసారి చూసేంత గొప్పగా లేదనీ చాలా మంది అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మహేష్ టీం సినిమాలో మరిన్ని సీన్లు కలిపితే బావుంటుందని భావిస్తున్నారట.

సినిమాలో మహేశ్ బాబుకి నచ్చిన సీన్స్ కొన్ని వున్నాయట. అయితే నిడివి ఎక్కువగా ఉందని ఆ సీన్స్ ను ట్రిమ్ చేశారట. ఇప్పుడు ఆ సీన్స్ ను పూర్తిగా వుంచుతారట. అంతేకాదు కామెడీకి సంబంధించిన ఒకటి .. రెండు సీన్స్ కూడా జోడించనున్నారట. ఈ కారణంగా 10 నిమిషాల నిడివి పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. రెండవ వారంలో కొత్త సీన్స్ జోడింపు ఉంటుందని చెబుతున్నారు.

సీన్లు కలిపిన తరువాత పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆసక్తిని కలిగిస్తోందిప్పుడు.

Show Full Article
Print Article
Next Story
More Stories