మోహన్ బాబు కొత్త సినిమా.. హాలీవుడ్ నుండి రీమేక్?

మోహన్ బాబు కొత్త సినిమా.. హాలీవుడ్ నుండి రీమేక్?
x
Highlights

గత కొద్ది కాలంగా సినిమాలకి దూరంగా ఉన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. ప్రస్తుతం మళ్లీ సినిమాల స్పీడ్ పెంచాలని అయన ఆలోచనలో ఉన్నారు. యాక్షన్ కథలు...

గత కొద్ది కాలంగా సినిమాలకి దూరంగా ఉన్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు.. ప్రస్తుతం మళ్లీ సినిమాల స్పీడ్ పెంచాలని అయన ఆలోచనలో ఉన్నారు. యాక్షన్ కథలు కాకుండా మంచి మెసేజ్ ఇచ్చే కథలపై మోహన్ బాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని తెలుస్తుంది. అందులో భాగంగానే హాలీవుడ్ లో మంచి హిట్టు అయిన"గోయింగ్ ఇన్ స్టైల్" అనే సినిమాని రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం..

పెన్షన్ అందుకునే వయసులో ఓ నలుగురు వ్యక్తులు కలిసి తమకు పెన్షన్ ఇవ్వడానికి నిరాకరించిన బ్యాంక్ ను దోపిడీ చేస్తారు. ఆ దోపడి చేసిన వారు ఎవరు అన్నది సినిమా నేపధ్యం.. ఈ సినిమాలో కొన్ని మార్పులు చేసి సినిమాని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే సినిమాకి సంబంధించి ఓ అధికార ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మి ప్రసన్న బ్యానర్ పైన మోహన్ బాబు నిర్మించనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories