చంద్రబాబుపై మోహన్ బాబు ట్వీట్ వార్..

chandrababu and mohan babu
x
chandrababu and mohan babu
Highlights

హీరో మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఉద్దేశించి పలు కామెంట్స్ చేసారు మోహన్...

హీరో మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వాఖ్యలు చేసారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబును ఉద్దేశించి పలు కామెంట్స్ చేసారు మోహన్ బాబు "చంద్రబాబు ఎలక్షన్స్ అయిపోయాయి, ఎవరు దారిన వాళ్ళు ఉన్నారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.అంతా ప్రశాంత వాతావరణం. ఈ సమయంలో మళ్ళీ ఇలా నా మనసును ఇబ్బంది పెడతావు అనుకోలేదు. రెండు రోజుల క్రితం క్రమశిక్షణ లేని వ్యక్తి మోహన్ బాబు అని నీ నోటి నుండి రావడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటూ ట్వీట్ చేసారు మోహన్ బాబు..



అంతే కాకుండా నా మనసును గాయపరిచావు. అన్న యన్. టి. ఆర్, అక్కినేని నాగేశ్వరరావు గారు మరియు నా సినిమా పరిశ్రమ క్రమశిక్షణ కలిగిన వ్యక్తి మోహన్ బాబు అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు, చెప్తుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే అని మరో ట్వీట్ చేసారు మోహన్ బాబు.. క్రమశిక్షణ అనే పదానికి, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది నువ్వు ఒక్కడివే. దయ చేసి ఏ సందర్భంలోనూ నా పేరుకు భంగం కలిగించేటట్టు ప్రస్తావించకు. అది నీకు నాకు మంచిది. ఎక్కడైనా, ఎప్పుడైనా ఎదురు పడితే సరదాగా మాట్లాడుకుందాం, అదీ నీకు ఇష్టమైతే. ఉంటా!" అని చంద్రబాబుని ఉద్దేశించి వరుస ట్వీట్లు చేసారు మోహన్ బాబు.. గతంలో చంద్రబాబుకి మోహన్ బాబు విభేదాలు తలెత్తాయి అన్న సంగతి తెలిసిందే..



Show Full Article
Print Article
More On
Next Story
More Stories