రాజమౌళిపై ఫైర్ అయిన యువ దర్శకుడు .. అన్ని సినిమాలు కాపీ అంటూ..

రాజమౌళిపై ఫైర్ అయిన యువ దర్శకుడు .. అన్ని సినిమాలు కాపీ అంటూ..
x
director Prashant Kumar, Rajamouli
Highlights

బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేశాడు దర్శకుడు రాజమౌళి.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా ఉన్నాడు.

బాహుబలి సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ద‌శ‌దిశ‌లా వ్యాపించేలా చేశాడు దర్శకుడు రాజమౌళి.. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకరిగా ఉన్నాడు.అయితే ప్రస్తుతం ఈ దర్శకుడు విమర్శలు ఎదురుకుంటున్నాడు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే పుస్తకాలు చదువుతూ, సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్న రాజమౌళి ఆస్కార్ అవార్డ్ పొందిన పారాసైట్ చిత్రంపై ఆసక్తికరమైన వాఖ్యలు చేశారు.

ఆ సినిమా చూస్తున్నంత సేపు బోరింగ్ ఫీలింగ్ క‌లిగింద‌ని, చూస్తూ అలానే ప‌డుకుండిపోయాన‌ని చెప్పుకొచ్చారు. నాకు స్లోగా ఉండే సినిమాలు నచ్చవని కామెంట్స్ చేశారు. ఆస్కార్ అవార్డుల‌లో ఉత్తమ విదేశీ చిత్రంగా , ఉత్తమ ద‌ర్శకుడు, ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగాల‌లో ప‌లు అవార్డులు దక్కాయి. అయితే ఇలాంటి సినిమాపై రాజమౌళి నెగిటివ్ గా కామెంట్స్ చేయడం ఇప్పుడు ఆసక్తికరమైన వాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనితో రాజమౌళిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అందులో భాగంగా దీనిపైన ఓ యువదర్శకుడు కామెంట్స్ చేశాడు. పారాసైట్‌ని చిత్రాన్ని చాలా మంది దర్శకులు ఎంత‌గానో ప్రశింసించారు.. కానీ బాహుబలిని ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు మాట్లాడినట్లు తానెక్కడా వినలేదని, చూడలేదని, ఒరిజినాలిటీ గురించి మాట్లాడుకుంటే మీ సై సినిమాలో ఓ సీన్ మొత్తాన్ని కాపీ చేసారు అని ప్రశాంత్ త‌న లేఖ‌లో పేర్కొన్నాడు.అంతేకాకుండా పారాసైట్ చిత్రం వాస్తవిక‌త‌కి అద్దం ప‌ట్టేలా ఉందని ప్రశాంత్ కుమార్ తన లేఖలో పేర్కొన్నాడు.

ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్.ఆర్.ఆర్(రౌద్రం రణం రుధిరం).. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో సినిమా వాయిదా పడింది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories