నాగశౌర్యతో మెహ్రీన్

నాగశౌర్యతో మెహ్రీన్
x
Highlights

ఎఫ్ 2 సినిమా విజయవంతం కావడంతో హీరోయిన్ మెహ్రీన్ కు ఆఫర్ల వెల్లువ మొదలైంది. దీంతో ఈపాటికే బిజీగా మారిపోవాల్సి ఉంది. అయితే, సినిమాలు ఒప్పుకునే విషయంలో...



ఎఫ్ 2 సినిమా విజయవంతం కావడంతో హీరోయిన్ మెహ్రీన్ కు ఆఫర్ల వెల్లువ మొదలైంది. దీంతో ఈపాటికే బిజీగా మారిపోవాల్సి ఉంది. అయితే, సినిమాలు ఒప్పుకునే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. తనకు నచ్చకపోతే ఓకె చెప్పడానికి వెనకడుగు వేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇపుడు తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ఈ సుందరి తరువాత సినిమా యంగ్ హీరోతో చేయడానికి ఒప్పుకుంది.

నిర్మాతగా తాను తీయబోతున్న సినిమాలో తన సరసన హీరోయిన్ గా మెహ్రీన్ ను ఎంపికచేసుకున్నాడట నాగశౌర్య. కొత్త దర్శకుడితో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందించాం బోతున్న ఈ సినిమాలో చేయడానికి మెహ్రీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. నాగశౌర్య అవసరాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే మెహ్రీన్ హీరోయిన్ గా సినిమా ప్రారంభమవుతుందట.

Show Full Article
Print Article
Next Story
More Stories