Top
logo

ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన రామ్ చరణ్.. చిరు ఆసక్తికరమైన ట్వీట్

ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన రామ్ చరణ్.. చిరు ఆసక్తికరమైన ట్వీట్Megastar Chiranjeevi and Ram Charan (File Photo)
Highlights

తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేందుకు సినీ తారాలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటారు..

తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉండేందుకు సినీ తారాలు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటారు.. ఇందులో అందరు యంగ్ హీరోస్ ముందుంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం కాస్తా వెనుకే ఉన్నాడని చెప్పాలి. అప్పుడెప్పుడో ఫేస్ బుక్ లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ గత ఏడాది ఇన్ స్టా గ్రామ్ లో చేరారు. ఇక తాజాగా ఆయన తండ్రి చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇక అదే రోజున రామ్ చరణ్ కూడా ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేసి అందరిని మరింతగా సప్రైజ్ చేశారు.

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చరణ్‌కు చిరంజీవి స్వాగతం చెబుతూ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు.. '' ట్విట్టర్ ప్రపంచంలోకి రామ్ చరణ్‌కు స్వాగతం. సింహాన్ని దాని పిల్ల ఫాలో అవుతుంది'' అంటూ చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిని మెగా అభిమానులు షేర్ చేస్తూ సంతోషిస్తున్నారు. ఇక ట్విట్టర్ ఖాతా ఓపెన్ చేసిన అనంతరం చరణ్ మొదటి పోస్ట్ తోనే అందరి ప్రశంసలు అందుకున్నారు. కరోనా వైరస్ తో అతలాకుతలం అవుతున్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

ఈ క్రమంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకి అండగా నిలిచేందుకు తన వంతు సహాయంగా 70 లక్షల రూపాయాలను అందజేస్తున్నట్లు చరణ్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దీనికి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తి అని చరణ్ పేర్కొన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు, ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు 50 లక్షల రూపాయల చొప్పున అందజేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్నాడు. తాజాగా విడుదల చేసిన మోషన్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చే ఏడాది జనవరి 8 న ప్రేక్షకుల ముందుకు సినిమాని తీసుకురానున్నారు.




Web TitleMegastar Chiranjeevi welcomes ram charan to the twitter
Next Story


లైవ్ టీవి