కరోనా విముక్త భారతాన్ని సాధిద్ధాం : జనతా కర్ఫ్యూ పై చిరంజీవి

కరోనా విముక్త భారతాన్ని సాధిద్ధాం : జనతా కర్ఫ్యూ పై చిరంజీవి
x
Megastar chiranjeevi
Highlights

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరుగుతుంది. ఈ వైరస్ దాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్ ని అరికట్టేందుకు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.ఇక సినీ తారలు కూడా తమ వంతుగా సోషల్ మీడియా వేదికగా దీనిపైన ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక వీరితో పాటు వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు మొదలగు వారు తమ వంతుగా సహాయం చేస్తున్నారు. ఇక ఆదివారం రోజున ఉదయం ఏడూ గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూని భారత ప్రధాని మోడీ పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఈ నేపధ్యంలో పలువురు సెలబ్రిటీలు సంఘీభావం తెలుపుతున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి దీనికి మద్దతు తెలుపుతూ ఓ వీడియోని చేశారు.

"అందరికీ నమస్కారం.. ఈ కరోనా వైరస్‌ని నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలు సేవాభావంతో 24 గంటలు పనిచేస్తోన్న వైద్యులు, నర్సులకు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులు, పోలీస్‌ శాఖ వారికి అలాగే ఆయా ప్రభుత్వాలకి మనం హర్షాతిరేఖలు ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయమిది. దేశ ప్రధాని పిలుపు మేరకు ఆదివారం ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనమందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్ధాం. ఇళ్ళకే పరిమితమవుదాం. వారికి సరిగ్గా సాయంత్రం 5గంటలకి మన ఇంటి గుమ్మాలలోకి వచ్చి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలుపుదాం. ఇది మన ధర్మం. భారతీయులుగా మనమందరం ఐకమత్యంతో ఒకటిగా నిలబడి ఈ క్లిష్టపరిస్థితులని ఎదుర్కొందాం. సామాజిక సంఘీభాం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్ధాం. జైహింద్" అని చిరంజీవి వీడియో ద్వారా తెలిపారు.

మనల్ని రక్షించేందుకు తమ ప్రాణాలను పణంగా పెట్టిన ధైర్యశీలులకు సెల్యూట్ చేద్దాం.. ఆదివారం సాయంత్రం 5 గంటలకు బాల్కనీల్లో నిల్చుని మనం కొట్టే చప్పట్లు ప్రతిధ్వనించాలి.. అదే మనం వారికిచ్చే గౌరవం, చప్పట్ల శబ్ధంలో అవి కనిపించాలి ' అంటూ మహేష్ ట్వీట్ చేయగా, "కరోనావైరస్‌కి వ్యతిరేకంగా మన దగ్గర ఉన్న ఏకైక ఆయుధం సామాజిక దూరం పాటించ‌డం. మన గౌరవప్రదమైన ప్రధానమంత్రికి సంఘీభావంగా ఆదివారం ఇంట్లోనే ఉంటామ‌ని అంద‌రం ప్రతిజ్ఞ చేద్దాం" అని నాగర్జున ట్వీట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories