విజయ్ కి మద్దతుగా నిలిచిన మెగాస్టార్!

విజయ్ కి మద్దతుగా నిలిచిన మెగాస్టార్!
x
Chiranjeevi, Vijay Devarakonda (File Photo)
Highlights

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కరోనా ప్రభావంతో అల్లడిపోతున్నా ప్రజలను ఆదుకోవడానికి తనవంతుగా సహాయం చేయడానికి ది దేవరకొండ ఫౌండేషన్, మిడిల్ క్లాస్...

యంగ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ కరోనా ప్రభావంతో అల్లడిపోతున్నా ప్రజలను ఆదుకోవడానికి తనవంతుగా సహాయం చేయడానికి ది దేవరకొండ ఫౌండేషన్, మిడిల్ క్లాస్ ఫండ్ అనే ఫౌండేషన్ లను స్థాపించిన సంగతి తెలిసిందే.. విజయ్ చేస్తున్న ఈ సహాయాన్నీ చాలా మంది అభినందించారు. కానీ కొన్ని వెబ్సైట్స్ మాత్రం తప్పుడుగా ప్రచారం చేశాయి. అయితే దీనిపైన సీరియస్ అయిన విజయ్ దేవరకొండ తనదైన శైలిలో స్పందించారు.

తప్పుడు వార్తలు రాసిన సదరు వెబ్సైట్స్ పై విజయ్ ఫైర్ అయ్యారు. తాను చేస్తున్న సహాయం గురించి ప్రశాంతంగా వివరించారు. అంతేకాకుండా కరోనా కట్టడికి విజయ్ దేవరకొండ విరాళం ఇవ్వడం లేదు అంటూ కొన్ని ఆర్టికల్స్ రాశారని, అసలు నన్ను అడగడానికి మీరు ఎవరు అంటూ విజయ్ ఫైర్ అయ్యారు. నాకు నచ్చినప్పుడు, నేను అనుకున్నప్పుడు, నాకు కుదిరినప్పుడు, నేను ఎలా ఇవ్వాలో, ఎవ్వరికి ఇవ్వాలో, నా మనసుకు ఎవరు కనెక్ట్ అయితే వాళ్లకు ఇస్తా. అది నా ఇష్టం. అంటూ విజయ్ చెప్పుకొచ్చారు.

అయితే విజయ్ కి మద్దతుగా సినీ తారలు నిలుస్తున్నారు. మహేష్ బాబు, నాగబాబు, రవితేజ, హరీష్ శంకర్, అనిల్ రావిపూడి, కొరటాల శివ మద్దతు తెలిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా విజయ్ కి మద్దతు తెలిపారు. విజయ్ మీ ఆవేదనను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయన్నారు. మీ వెంట మేమంతా ఉన్నాం. మంచి పనిచేసే విషయంలో ఎప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాకుండా జర్నలిస్టులు కూడా దయచేసి మీ సొంత అభిప్రాయాల్ని రుద్దకుండా వార్తను వార్తలాగా రాయాలన్నారు మెగాస్టార్.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories