సమాజం గురించి పిల్లలనే వద్దు అనుకున్నాడు.. కొరటాల గురించి చిరు ఆసక్తికర వాఖ్యలు

సమాజం గురించి పిల్లలనే వద్దు అనుకున్నాడు.. కొరటాల గురించి చిరు ఆసక్తికర వాఖ్యలు
x
Koratala Siva and Chiranjeevi (File Photo)
Highlights

గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్నాడు ఇది చిరంజీవికి 152వ సినిమా..

గత ఏడాది సైరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్నాడు ఇది చిరంజీవికి 152వ సినిమా.. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం వలన సినిమా వాయిదా పడింది..

అయితే తాజాగా ఓ దినపత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన మెగాస్టార్ దర్శకుడు కొరటాల శివ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెల్లడించాడు. కరోనా వైరస్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం తర్వాత ఆచార్య సినిమాని కొన్ని రోజులు వాయిదా వేద్దామని చెప్పగానే ఎం ఆలోచించకుండా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్న సమాజం పట్ల మంచి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి అని అన్నాడు. ఇక దిగజారుతున్న రాజకీయాలు - నాయకుల నాయకుల వ్యక్తిత్వాలు - ప్రవర్తన గురించి కొరటాల ఎప్పుడూ ఆందోళన చెందుతుంటాడని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా తనకు పిల్లలు పుడితే స్వార్థంతో సమాజానికి ఏమీ చేయలేమో ఏమో అని బిడ్డలు వద్దనే అనుకున్నాడని కొరటాల గురించి గొప్పగా వెల్లడించాడు చిరంజీవి..

ఇక ఇదే ఇంటర్వ్యూలో ఆచార్యలో మహేష్ బాబు అని వస్తున్న వార్తలపై చిరు స్పందించాడు. అసలు ఆచార్యలో మ‌హేష్ న‌టిస్తున్నాడ‌న్న వార్త ఎలా బ‌య‌ట‌కి వ‌చ్చిందో అర్ధం కావ‌డం లేదు అని అన్నారు. మ‌హేష్‌ని నేను చాలా గౌర‌విస్తాను. ఆయ‌న కూడా న‌న్ను అంతే ప్రేమిస్తారు. మ‌హేష్ నాకు కొడుకు లాంటి వాడు అని స్పష్టం చేశారు. మ‌హేష్ తో క‌లిసి సినిమా చేసే ఛాన్స్ వ‌స్తే త‌ప్పక చేస్తాన‌ని కూడా చిరు పేర్కొన్నారు. ఇక ఓ పాత్రకు ముందునుంచి రామ్ చరణ్ అయితే బాగుంటుందని దర్శకుడు కొరటాల అనుకుంటున్నాడని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుతం చరణ్ ఓ రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాకుండా చరణ్ మాకు ఎంత వరకు డేట్స్ ఇవ్వగలడు అనే అనుమానం ఉంది. ఒకవేళ రాజమౌళి, కొరటాల శివ ఒక అండర్‌స్టాండింగ్‌కు వస్తే 'ఆచార్య'లో చరణ్ ఉండొచ్చుని చిరు వెల్లడించాడు. చిరు తాజా వాఖ్యాలతో ఆచార్యలో మహేష్ అనే వార్తలకి చెక్ పెట్టినట్లు అయింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories