Top
logo

కొరటాల శివ సినిమా కోసం చిరంజీవి డెడికేషన్ ...

కొరటాల శివ సినిమా కోసం చిరంజీవి డెడికేషన్ ...
X
Highlights

సైరా సినిమాతో మంచి హిట్టు కొట్టాడు చిరంజీవి... ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ...

సైరా సినిమాతో మంచి హిట్టు కొట్టాడు చిరంజీవి... ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా కోసం చిరంజీవి జిమ్ లో చాలా కసరత్తులు చేస్తున్నాడు. ప్రస్తుతం 64 సంవత్సరాలు ఉన్న చిరు తన తదుపరి సినిమా కోసం బాగానే కష్టపడుతున్నాడు.

ఈ వయసులో చిరు జిమ్‌కి వెళ్లి వర్కౌట్స్ చేయడాలు, కండలు పెంచడాలు చాలా కష్టం. కానీ సినిమా పైన ఉన్న డెడికేషన్ తో చిరు ఇలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం దీనికీ సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో చిరంజీవి దేవాదాయ ధర్మదాయ శాఖకి సంబంధించిన ఉద్యోగిగా కనిపించనున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తుంది.

Next Story