Megastar Chiranjeevi: తన కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన మెగాస్టార్

Megastar Chiranjeevi: తన కొత్త సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసిన మెగాస్టార్
x
Chiranjeevi (File Photo)
Highlights

గత ఏడాది సైరా నరసింహ రెడ్డి సినిమాతో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి తన 152 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే..

గత ఏడాది సైరా నరసింహ రెడ్డి సినిమాతో ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి తన 152 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్ , మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి నిర్మిస్తోంది. విజయదశమి కానుకగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా కోకాపేటలో ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాలో చిరు రెండు విభిన్నమైన పాత్రలలలో కనిపించనున్నారని, అందులో ఒకటి నక్సలైట్ కాగా మరొకటి దేవాదాయ శాఖాలో పనిచేసే అధికారిగా కనిపించనునట్టు సమాచారం.

అయితే ఈ సినిమాకి టైటిల్ పై రకరకాల వార్తలు వచ్చాయి. గోవిందా ఆచార్య, గోవిందా గోవిందా అని పలు పేర్లు బయటకు వచ్చినప్పటికీ చిత్రబృందం దీనిపైన స్పందించలేదు. అయితే స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేశారు. సినీ నటుడు బ్రహ్మజీ కుమారుడు సంజయ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఓ పిట్ట కథ' మూవీ ప్రీరిలీజ్ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్‌ తన తదుపరి చిత్రం పేరును 'ఆచార్య'గా ప్రకటించించారు. కొరటాల శివ ఈ సినిమా టైటిల్ ని ఓ కార్యక్రమం పెట్టి అనౌన్సు చేద్దామని అనుకున్నాడు కానీ నా నోటి ద్వారా లాంఛ్‌ అయిపోయింది. సారీ శివ ఏమనుకోవద్దు. మంచి మాటలు అపుకోలేము అంటూ ఆపడం కూడా కరెక్టు కాదు అంటూ చిరంజీవి వెల్లడించారు.

చిరు తన తదుపరి చిత్ర టైటిల్ ని అనౌన్సు చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దసరాకి సినిమాని రిలీజ్ చేయనున్నారు.

నక్సలైట్ లుక్ లో మెగాస్టార్ లుక్ లీక్ :

ప్రస్తుతం శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో మెగాస్టార్ నక్సలైట్ గెటప్ లో ఉన్న లుక్ లీకైంది... ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫోటోతో పాటు ఓ వీడియో కూడా లీక్ అయింది. అయితే దీనిపైన వెంటనే అప్రమత్తమైన చిత్ర యూనిట్ వెంటనే సదరు వీడియోను ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల నుంచి తొలిగించారు. అయితే ఫొటోల్ని మాత్రం తొలిగించడం వీళ్ల వల్ల కావడం లేదు. అప్పటికే ఫోటో సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపొయింది. అయితే ఈ స్టిల్ ఎవరు లీక్ చేశారు అన్నదానిపై చిత్ర యూనిట్ కి అంతుచిక్కడం లేదు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories