ఒకేసారి ఆ ఘనతను అందుకున్న చిరు, చరణ్

ఒకేసారి ఆ ఘనతను అందుకున్న చిరు, చరణ్
x
Megastar Chiranjeevi, Ramcharan(File photo)
Highlights

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులకి మరింతగా దగ్గరయ్యేందుకు తాజాగా ట్విట్టర్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులకి మరింతగా దగ్గరయ్యేందుకు తాజాగా ట్విట్టర్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే.. చిరంజీవి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 25న ట్విటర్‌ ఖాతా తెరవగా, ఆ తర్వాత రామ్ చరణ్ కూడా మార్చి 26న ట్వీటర్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. తమకి సినిమాకి సంబంధించిన విషయాలతో పాటు ప్రస్తుతం దేశం ఎదురుకుంటున్న పరిస్థితుల పైన కూడా ఎప్పటికప్పుడు స్పందిస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం వీరిద్దరూ ట్విట్టర్‌లో పోటిపడి మరి దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ట్విటర్లో వీరి ఫాలోవర్ల సంఖ్య 5 లక్షలు దాటింది. వీరిద్దరూ ఒకేసారి 5 లక్షల ఫాలోవర్ల మార్కును అందుకోవడం చూసి మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇందులో చరణ్ కన్నా చిరంజీవికి కాస్త ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అంతేకాకుండా చరణ్ కన్నా చిరంజీవి ఎక్కువ ట్వీట్స్ చేశారు. చిరంజీవి 112 ట్వీట్లు చేయగా.. చరణ్ 18 ట్వీట్లు మాత్రమే చేశారు.

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వచ్చేసరికి గత ఏడాది సైరా సినిమాతో మెప్పించిన చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఇందులో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వైరస్ వలన వాయిదా పడింది. దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇక చరణ్ సినిమాల విషయానికి వచ్చేసరికి ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో చరణ్ తో పాటుగా ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. ఇక ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ ఆలియా భట్ నటిస్తుండగా, తారక్‌కు జోడీగా ఒలీవియా మోరిస్ నటిస్తోంది. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories