మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ : ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ : ఆచార్య ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!
x
Chiranjeevi and Koratala Siva
Highlights

సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే..

సైరా సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇది చిరంజీవికి 153 వ సినిమా.. లేట్ గా షూటింగ్ మొదలైన ఈ షూటింగ్ కరోనా ఎఫెక్ట్ పడడంతో మరింత ఆలస్యం అవుతుంది. అయితే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. చిత్ర యూనిట్ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను శ్రీరామ‌న‌వి సంద‌ర్భంగా ఏప్రిల్ 2న విడుద‌ల చేయాల‌ని భావిస్తుంద‌ట‌. ముందుగా ఉగాదికే సందర్భంగా రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ ఆరోజే చిరంజీవి ట్విట్టర్ లోకి రావడం, చరణ్ RRR స్పెషల్ వీడియో ఉండడంతో శ్రీరామ‌న‌వి సంద‌ర్భంగా రిలీజ్ చేస్తే బాగుంటుదని అనుకోని తమ ఆలోచనను మానుకున్నారట మేకర్స్..

ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ త్రిషను అనుకోగా ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది. దీంతో ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ఎంపిక చేసింది చిత్రబృదం.. చిరంజీవి, కాజల్ గతంలో ఖైదీ నెంబర్ 150 సినిమాలో నటించిన విషయం అందరికి తెలిసిందే. .పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని దసరా సందర్భంగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. ఇందులో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories