జార్జ్‌ రెడ్డి సినిమాకి మెగా సపోర్ట్

george reddy
x
george reddy
Highlights

జార్జ్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కి మధ్య చాలా పోలికలు ఉన్నాయని అందులో చెప్పుకొచ్చి సినిమా పైన భారీ అంచనాలను పెంచేసాడు నాగబాబు

విద్యార్థి నాయకుడిగా పోరాటాలు చేసిన జార్జ్‌ రెడ్డి పైన ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా శుక్రవారం (22-11-2019) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో వంగవీటి ఫేం సందీప్‌ మాధవ్‌ మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మెగా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా గురించి మెగా బ్రదర్ నాగబాబు ఓ స్పెషల్ వీడియో చేసారు. జార్జ్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కి మధ్య చాలా పోలికలు ఉన్నాయని అందులో చెప్పుకొచ్చి సినిమా పైన భారీ అంచనాలను పెంచేసాడు నాగబాబు . తాజాగా ఈ సినిమాలోని 'అడుగు అడుగు' అనే పాటను మెగాస్టార్‌ చిరంజీవి తన చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ఈ సినిమాని తీస్తున్న చిత్ర యూనిట్ ని చిరు ప్రత్యేకంగా అభినందించారు. ఇక సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నెక్లెస్‌ రోడ్‌లో నిర్వహించాలి అనుకున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా రావాల్సి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. మరో వేదికలో ఈ ఈవెంట్ ని నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాని సిల్లీ మంక్స్, త్రీ లైన్స్‌ సినిమా బ్యానర్లతో కలిసి మైక్‌ మూవీస్‌ అధినేత అప్పిరెడ్డి నిర్మిస్తుండగా, జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా నవంబర్ 22 న ప్రేక్షకుల ముందకు రానుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories