2019 Review: ఈ ఏడాది 'పండగ' చేసుకుంటున్న మెగా హీరోలు

2019 Review: ఈ ఏడాది పండగ చేసుకుంటున్న మెగా హీరోలు
x
Highlights

దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాయి. నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, మెగా ఫ్యామిలిలు..

దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాయి. నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, మెగా ఫ్యామిలిలు.. ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ప్రేక్షకులను అలరించేందుకు కొన్ని సినిమాలను విడుదల చేసారు. మరి ఇందులో ఎవరు పై చేయి సాధించారు అన్నది ఓ సారి తెలుసుకుందాం.

నందమూరి ఫ్యామిలీ:

సంక్రాంతి హీరో అని బాలయ్యకి ఎలాగు పేరుంది. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తన తండ్రి బయోపిక్ ని సంక్రాంతికే రిలీజ్ చేశాడు బాలయ్య.. ఈ బయోపిక్ ని NTR కథానాయకుడు, మహానాయకుడు . తెరకెక్కించాడు. ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమా తర్వాత రూలర్ అనే సినిమాని తెరకెక్కించాడు బాలయ్య. ఈ సినిమా కూడా బాలయ్యకి చేధుఅనుభవాన్నే మిగిల్చింది. ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో అయిన కళ్యాణ్ రామ్ 118 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పర్వాలేదని అనిపించాడు. ఎన్టీఆర్ నుంచి ఒక్క సినిమా కూడా ఈ సంవత్సరం రిలీజ్ కాలేదు.

దగ్గుబాటి ఫ్యామిలీ:

పక్కా ఫ్యామిలీ కం కామెడీగా తెరకెక్కిన F2 చిత్రంలో నటించి మంచి హిట్టు కొట్టాడు వెంకటేష్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది.

ఇక నాగచైతన్యతో కలిసి వెంకీమామ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం కూడా మంచి విజయాన్ని అందుకుంది. బాబీ దర్శకత్వం వహించాడు. ఇక దగ్గుబాటి రానా హీరోగా తెలుగులో సినిమాలు చేయనప్పటికీ ఎన్టీఆర్ కధానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించాడు.

మెగా ఫ్యామిలీ:

ఎప్పటినుంచో అనుకుంటున్నా డ్రీం ప్రాజెక్ట్ సైరాని చిరంజీవి ఈ సంవత్సరం తెరకెక్కించారు. చిరంజీవి. ప్యాన్ ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మంచి హిట్టు కాగా మిగతా బాషలలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక అయన తనయుడు రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు . ఈ సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో పాటు తీవ్ర విమర్శ్గల పాలైంది.

ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఈ సంవత్సరం విడుదలైన రెండు సినిమాలు F2, గద్దలకొండ గణేష్ మంచి హిట్టు అయ్యాయి. ఇందులో ముఖ్యంగా గద్దలకొండ గణేష్ వరుణ్ తేజ్ కి మంచి పేరును తీసుకువచ్చింది. ఇక మెగా మేనల్లుడు సాయి తేజు హీరోగా ఈ సంవత్సరం విడుదలైన చిత్రలహరి, ప్రతి రోజూ పండగే చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక మరో మెగా హీరో అల్లు శిరీష్ నటించిన ABCD ఘోర పరాజయాన్ని చూసింది.

అక్కినేని ఫ్యామిలీ:

అక్కినేని హీరోల్లో ఈ సంవత్సరం నాగచైతన్య రెండు హిట్లు కొట్టాడు. భార్య సమంతతో మజిలి, మామ వెంకటేష్ తో వెంకీమామ సినిమాలను చేశాడు చైతూ.. ఈ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక నాగర్జున చేసిన మన్మధుడు 2, అఖిల్ చేసిన మిస్టర్ మజ్న్లు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇక అక్కినేని మరో హీరో సుమంత్ ఈ సంవత్సరం హీరోగా సినిమాలు చేయలేదు కానీ బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో కనిపించి మెప్పించాడు. ఇక సుశాంత్ చి.ల.సౌ సినిమాతో మంచి హిట్టు కొట్టాడు.

మొత్తం మీదా చూసుకుంటే ఈ సంవత్సరం మెగా ఫ్యామిలీ దే పై చేయి గా కనిపిస్తుంది. సంవత్సరం ప్రధమంలో రామ్ చరణ్ నిరాశపరిచిన అదే పండగకి వరుణ్ తేజ్ F2 తో ఆ నిరాశను పారదోలాడు. చిరంజీవి సైరా, సంవత్సరం మధ్యలో సంచలనం సృష్టిస్తే చివరలో మెగా మేనల్లుడు సాయి తేజ్ ప్రతి రోజూ పండగే చిత్రంతో పండగ లాంటి సినిమా తెచ్చి హిట్టు కొట్టాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories