మన్మధుడు2 ఆ సినిమా ఫ్రీమేకా?

మన్మధుడు2 ఆ సినిమా ఫ్రీమేకా?
x
Highlights

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో మన్మధుడు 2 సినిమా రూపుదిద్దుకుంటోంది. మన్మధుడు అంటేనే తెల్సిపోతోందిగా కింగ్ నాగార్జున సినిమా అని. అవును ఆయనే హీరో....

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో మన్మధుడు 2 సినిమా రూపుదిద్దుకుంటోంది. మన్మధుడు అంటేనే తెల్సిపోతోందిగా కింగ్ నాగార్జున సినిమా అని. అవును ఆయనే హీరో. ఈ సినిమా టీజర్ ఇటీవల రిలీజ్ అయింది. మంచి రేస్పాన్సూ వచ్చింది. అభిమానులు అయితే ఫిదా అయి పోయారు. 2002లో రిలీజ్‌ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

టీజర్ వచ్చిన తరువాత ఈ సినిమా పై జోరుగా ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. ఈ సినిమా ఓ ఫ్రెంచి సినిమా కి ఫ్రీమేకని చాలా మంది అనుకుంటున్నారు. ఆ సినిమాలో ఓ 43 ఏళ్ల యువకుడ్ని (?) పెళ్లి చేసుకోమని కుటుంబమంతా పోరుతుంటుంది. కానీ, ఆ యువకుడు ప్లేబాయ్ లా జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఇదే లైన్ లో సినిమా ఉంటుంది. 2006లో రిలీజ్‌ అయిన ఫ్రెంచ్‌ మూవీ 'ప్రీట్-మోయి టా మెయిన్' లైన్ అది. మన్మథుడు 2 టీజర్‌ లోనూ ఇదే కాన్సెప్ట్‌ కనిపించటంతో ఈ సినిమా రీమేక్‌గా ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories