మన్మధుడు 2 పోర్చుగల్ షూటింగ్ పూర్తి

మన్మధుడు 2 పోర్చుగల్ షూటింగ్ పూర్తి
x
Highlights

అక్కినేని నాగార్జున తాజా సినిమా మన్మధుడు 2 శరవేగంగా ముస్తాబవుతోంది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా మన్మధుడు కి ఏ మాత్రం తీసిపోని...

అక్కినేని నాగార్జున తాజా సినిమా మన్మధుడు 2 శరవేగంగా ముస్తాబవుతోంది. పూర్తి స్థాయి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా మన్మధుడు కి ఏ మాత్రం తీసిపోని విధంగా రాబోతోందని సినిమా యూనిట్ చెబుతోంది. కాగా, నెల రోజుల నుంచి పోర్చుగల్ లోని లిస్బన్, పోర్టో సిటీల్లో సినిమా చిత్రీకరణ నడుస్తోంది. ఇపుడు ఈ షెడ్యూల్ పూర్తి చేసుకున్నట్టు యూనిట్ వర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్ లో నాగార్జున, రకుల్ ప్రీత్ సింగ్ లపై ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించారు. వారితో పాటు రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు కూడా పాల్గొన్నారు. మన్మదుడులో బ్రహ్మానందం పోషించిన పాత్ర ఇప్పటికి నవ్వుల పూవులు పూయిస్తూనే ఉంది. అదే పాత్రను ఇపుడు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో చేస్తున్నాడు.

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో సినిమా రూపొందుతోంది. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్నమన్మధుడు 2 సినిమాకి ఎం. సుకుమార్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ సంయుక్తంగా మనము ఎంటర్టైనమెంట్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, వైకం 18 మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మితమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories