చిరు,కొరటాల సినిమాకి ఆ సంగీత దర్శకుడు?

chiranjeevi 152 movie
x
chiranjeevi 152 movie
Highlights

అందులో సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో

సైరా లాంటి బ్లాక్ బస్టర్ హిట్టు తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కొరటాల దర్శకత్వంలో మొదలు పెట్టాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ లో పట్టాలేక్కనుంది.. ఈ సినిమాకి సంగీత దర్శకడు ఎవరు అన్నది ఇంకా తేలలేదు. వాస్తవానికి కొరటాల అన్ని సినిమాలకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం చేసుకుంటూ వచ్చారు. కానీ ఈ సినిమాకి మాత్రం చాలా మంది సంగీత దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి.

అందులో సైరాకి సంగీతం అందించిన అమిత్ త్రివేది పేరు ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్ లో మణిశర్మ పేరు వినిపిస్తుంది. గతంలో మణిశర్మ చిరంజీవి సినిమాలకి ఆస్థాన సంగీత దర్శకుడిగా ఉండేవాడు. ఇప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ ని రిపీట్ చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉనట్టు తెలుస్తుంది.

ఈ మధ్య మణిశర్మ సంగీతం అందించిన లై, ఇస్మార్ట్ శంకర్ సినిమాలు బాగా హిట్టు అయ్యాయి. దీనితో మణి ఈజ్ బ్యాక్ అని చాలా మంది అన్నారు. ఇప్పుడు మణిశర్మని ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ సినిమాని మ్యాట్ని ఎంటర్టైన్మెంట్ తో కలిసి కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాని విడుదల చేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories