తమ్ముడు ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తా!

తమ్ముడు ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తా!
x
Highlights

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని ఉద్దేశించి ''తమ్ముడు, మై లిటిల్ బ్రదర్.. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా.

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ని ఉద్దేశించి ''తమ్ముడు, మై లిటిల్ బ్రదర్.. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తాగా'' అంటూ ట్వీట్ చేశారు మంచు వారి హీరో విష్ణు.. ఇంతకి విష్ణు ఆ ట్వీట్ ఎందుకు చేశారనే కదా మీ అనుమానం.. ప్రతి రోజూ పండగే లాంటి హిట్ తర్వాత సాయి ధరమ్ తేజ్ చేస్తున్న సినిమా . 'సోలో బ్రతుకే సో బెటర్'.. టైటిల్ తోనే సినిమాపైన మంచి అంచనాలను క్రియేట్ చేశాడు ఈ మెగా హీరో..

సినిమా ప్రమోషన్ లో భాగంగా వాలంటైన్ వీక్ సందర్భంగా హీరో సాయి తేజ్ సోలో బ్రతుకు గురించి ఓ ఫిలాసఫీ చెప్పారు. సోలో సోదర సోదరీమణులారా...ఈ వాలంటైన్స్ వీకెండ్ మనం అంతా కలిసి జరుపుకుందాం...మన స్లోగన్ ఒకటే...సోలో బ్రతుకే సో బెటర్ అని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా తన సోలో బ్రతుకును తాను చాలా బాగా నడిపిస్తున్నానని, తనలాగా సింగిల్‌గా ఉన్నవాళ్లు కూడా సోలో బ్రతుకును ఎలా గడుపుతున్నారో చెప్పాలని ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా సోలో బతుకు వల్ల సోలో బ్రతుకు వల్ల తనకున్న అడ్వాంటేజస్‌ ఏంటో ట్విట్టర్ లో పేర్కొన్నాడు. అవేంటో చూడండి !

1. ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోతే నేను పెద్దగా టెన్షన్ పడను.

2. రెస్టారెంట్‌కి వెళ్తే నా ఫుడ్‌కి మాత్రమే నేను పే చేస్తాను. (వాలెట్‌కి బొక్క పడే ఛాన్సే లేదు)

3. క్రికెట్ ఆడేటప్పుడు కాల్ వచ్చి గేమ్ మధ్యలో వెళ్లాల్సిన పని నాకు లేదు.

4. షూట్, క్రికెట్, జిమ్, హోమ్, ఫ్రెండ్స్ - నాకు నచ్చినంత టైమ్ నాకు నచ్చిన వాటితో నేను స్పెండ్ చేయొచ్చు.

అయితే దీనిపైన మంచువారి హీరో విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''తమ్ముడు, మై లిటిల్ బ్రదర్.. ఈ ట్వీట్ నేను సేవ్ చేసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు సోలోగా ఉంటావో చూస్తాగా'' అంటూ తన సినిమాకి అల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు విష్ణు.. అయితే దీనిపైన సాయి తేజ్ స్పందిస్తూ.. " హహహహ.. విష్ణు అన్న మీ మాదిరిగా అందరికీ అదృష్టం ఉండాలి కదా" అంటూ రిప్లయ్ ఇచ్చాడు. సుబ్బు అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా వెండితెరకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాని మే 01 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇందులో సాయి తేజ్ సరసన ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories