ఆఫీషియల్ : సరికొత్త టైటిల్ తో మంచు మనోజ్ కం బ్యాక్

ఆఫీషియల్ : సరికొత్త టైటిల్ తో మంచు మనోజ్ కం బ్యాక్
x
Highlights

మూడేళ్ళ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మనోజ్ మళ్ళీ సినిమాలు చేయలేదు. ఈ సినిమా 2017 లో...

మూడేళ్ళ గ్యాప్ తర్వాత మంచు మనోజ్ మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నాడు. ఒక్కడు మిగిలాడు సినిమా తర్వాత మనోజ్ మళ్ళీ సినిమాలు చేయలేదు. ఈ సినిమా 2017 లో రిలిజైంది. ఈరోజు తన తదుపరి సినిమాకు సంబంధించిన మూవీ వివరాలను మనోజ్ వెల్లడించాడు. తన కొత్త సినిమాకి 'అహం బ్రహ్మాస్మి' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సినిమాని మొత్తం అయిదు భాషలలో రిలీజ్ చేయనున్నారు. శ్రీకాంత్ ఎన్ రెడ్డి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, తన తల్లి నిర్మల దేవితో కలిసి మనోజ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంకా సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ సందర్భంగా మంచు మనోజ్ ట్విట్టర్ లో స్పందిస్తూ.. " దొంగ దొంగది' సినిమా చేస్తున్నప్పుడు ఎలాంటి ఎమోషన్ ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఇప్పటివరకు తనకు ఆన్‌స్క్రీన్‌లోనే కాకుండా ఆఫ్‌స్క్రీన్‌లోనూ సపోర్ట్ చేస్తూ వచ్చిన ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. తన జీవితం అనుకున్న ఆర్ట్‌ను ఇన్నాళ్లూ చాలా మిస్సయ్యానంటూ.. 'సినీ అమ్మా వచ్చేసా' అని మనోజ్ ట్వీట్ చేశారు.

మంచు మనోజ్ బాలనటుడుగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. 'మేజర్ చంద్రకాంత్', 'అడవిలో అన్న', 'ఖదీగారు' సినిమాల్లో మనోజ్ బాలనటుడుగా నటించి మెప్పించాడు. దశరథ్ దర్శకత్వంలో వచ్చిన శ్రీ సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. ఆ తర్వాత చేసిన 'రాజూభాయ్', 'బిందాస్', 'వేదం', 'మిస్టర్ నూకయ్య', 'బిందాస్' వంటి సినిమాలు మనోజ్ కి మంచి పేరును తీసుకువచ్చాయి.

ఇక మంచు మనోజ్‌ 2015 మే 20 న ప్రణతిరెడ్డితో హైదరాబాద్‌ లో వివాహం జరిగింది. కానీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరు విడిపోయారు. . విదిపోయినప్పటికి మంచి స్నేహితుల్లాగే ఉంటామని మనోజ్ చెప్పుకొచ్చారు. విడాకుల తర్వాత కొత్త ఇన్నింగ్స్ ని మొదలు పెడుతున్నని చెప్పిన మనోజ్ ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ ని స్థాపించి కొత్త దర్శకులకు అవకశాలు ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తానని మనోజ్ చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే తన అభిమానుల ముందుకు వస్తున్నాడు. దీనితో అయన ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories