జేజెమ్మ పాత్ర అనుష్క చేయాల్సింది కాదట...!

జేజెమ్మ పాత్ర అనుష్క చేయాల్సింది కాదట...!
x
Highlights

హీరోయిన్ అనుష్క కెరియర్ లో మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా అరుంధతి. ఈ సినిమాలో అరుంధతి మరియు జేజెమ్మ అనే రెండు...

హీరోయిన్ అనుష్క కెరియర్ లో మోస్ట్ టర్నింగ్ పాయింట్ ఏమైనా ఉందా అంటే వెంటనే గుర్తొచ్చే సినిమా అరుంధతి. ఈ సినిమాలో అరుంధతి మరియు జేజెమ్మ అనే రెండు పాత్రల్లో అనుష్క కనబరిచిన నటన అమోఘం . ఈ సినిమాకి చాలా మంది ప్రశంసలు దక్కాయి . దీనికి కోడి రామకృష్ణ దర్శకుడు శ్యాం ప్రసాద్ రెడ్డి నిర్మాత . అయితే ముందుగా ఈ సినిమాలోని అరుంధతి పాత్ర కోసం అనుష్కని అనుకోలేదట ...!

ముందుగా ఆ పాత్ర కోసం మంచు లక్ష్మిని అనుకున్నారట దర్శక నిర్మాతలు. ఆ సమయానికి ఆమె అమెరికాలో ఉండడంతో డేట్స్ కుదరక అ పాత్ర చేయలేకపోయారు . అ తర్వాత అ పాత్ర కోసం మమత మోహన్ దాస్ ని సంప్రదించారు .కాని అప్పుడు ఆమె క్యాన్సర్ తో బాధపడుతుండటంతో ఈ సినిమా చేయలేకపోయింది. అలా అలా అ ప్రాజెక్ట్ అనుష్క దగ్గరికి వచ్చింది .ఆఫర్ అయితే ఆమె దగ్గరికి వచ్చింది కానీ ఆమెను అంత ఈజీగా ఒకే చెయ్యలేదు నిర్మాత శ్యాంప్రసాద్‌రెడ్డిగారు .

జేజెమ్మ పాత్ర కోసం సంబంధించిన కాస్ట్యూమ్స్‌ను ప్రత్యేకంగా తయారు చేయడానికి కేరళ నుంచి డిజైనర్లను రప్పించారు.సుమారుగా నాలుగు లక్షల రూపాయల ఖర్చు పెట్టి రెండు రకాల కాస్ట్యూమ్స్‌ తయారు చేయించారు. అవి ధరించిన తర్వాత సినిమా సెట్లో ఆమెతో కొన్ని డమ్మీ సన్నివేశాలు షూట్ చేసిన అనంతరం ఆమెని అ పాత్రకి కన్ఫర్మ్ చేసారు .అ పాత్ర పోషించి మెప్పించిన అనుష్కకి మరియు సినిమాకి చాలా అవార్డ్స్ లభించాయి...

Show Full Article
Print Article
Next Story
More Stories