Top
logo

సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా మలయాళం వ‌ర్షెన్ వచ్చేసింది..

samajavargamanasamajavargamana
Highlights

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల‌ వైకుంఠ‌పుర‌ములో... పూజా...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం అల‌ వైకుంఠ‌పుర‌ములో... పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తుంది. సుశాంత్, నవదీప్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్, హరిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాని విడుదల చేయనున్నారు.

అయితే తాజాగా ఈ సినిమాలోని సామ‌జ‌వ‌ర‌గ‌మ‌నా పాట మ‌ల‌యాళ వ‌ర్షెన్ విడుద‌ల చేశారు. ఈ పాటను అక్కడ ప్రముఖ గాయకుడు యేసుదాస్ కొడుకు విజయ్ యేసుదాస్ పాడారు.. ఇప్పటికే ఈ పాట తెలుగులో విడుదలై శ్రోతలను వీపరితంగా ఆకట్టుకుంటుంది. ఎక్కువ మంది లైక్ చేసిన తొలి తెలుగు పాటగా ఈ పాట రికార్డు క్రియేట్ చేసింది. ఈ పాటను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా సిద్ శ్రీరామ్ ఆలపించాడు.

ఇక మలయాళంలో అల్లు అర్జున్ కి మంచి మంచి డిమాండ్ ఉంది. అక్కడ బన్నిని ముద్దుగా మల్లు అర్జున్ అని పిలిచుకుంటారు అయన అభిమానులు.. అంగు వైకుంఠ‌పుర‌త్తు అనే పేరుతో మలయాళంలో ఈ సినిమాని విడుద‌ల చేయ‌నున్నారు.


Next Story