అనిల్ తో మరో సినిమా.. మహేష్ క్లారిటీ

అనిల్ తో మరో సినిమా.. మహేష్ క్లారిటీ
x
Highlights

హీరో మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఒక్కసారి వస్తే చాలు అనుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు. అలాంటింది రెండోసారి

హీరో మహేష్ బాబు ని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఒక్కసారి వస్తే చాలు అనుకునే దర్శకులు చాలా మంది ఉన్నారు. అలాంటింది రెండోసారి అంటే ఎగిరి గంతేయ్యారు. ఇక మహేష్ కూడా తనకి మంచి హిట్టు ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేయాలని అనుకుంటాడు. అందులో భాగంగానే గుణశేఖర్, పూరి జగన్నాధ్, శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల లాంటి దర్శకులు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టు లోకి యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా చేరబోతున్నాడు...

తాజాగా మహేష్ బాబు అనిల్ రావిపూడితో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాని చేశాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా అనుకున్నట్టుగానే మంచి విజయాన్ని అందుకుంది. తక్కువ టైంలో అనుకున్న బడ్జెట్ లో సినిమా తెరకెక్కించి హిట్టు మెట్టు ఎక్కించిన దర్శకుడు అనిల్ తో మహేష్ మరో సినిమాని చేసేందుకు సిద్దం అయ్యాడు.

సినిమా ప్రమోషన్లలో భాగంగా అనిల్‌తో మళ్లీ సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు మహేష్. అనిల్ వేరే సినిమా ఒకటి చేశాక తనతో తీస్తాడని మహేష్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లితో ఓ సినిమాని చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన మహర్షి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత మహేష్ అనిల్ రావిపూడితో సినిమాని చేయనున్నాడు.

ఇక అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత 'ఎఫ్ 2'కి సీక్వెల్ చేసే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే 'ఎఫ్ 2'కి సీక్వెల్ ఉంటుందని గతంలోనే అనౌన్సు చేశాడు అనిల్. అంతేకాకుండా వెంకటేష్ కూడా స్క్రిప్ట్ రెడీ అయిందని, త్వరలో సినిమా పట్టాలేక్కుతుందని చెప్పుకొచ్చాడు. ఎఫ్ 2' సినిమాను నిర్మించిన దిల్ రాజే ఈ సీక్వెల్ కి కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ఈ సీక్వెల్ కి ఫన్ ఫ్రస్టేషన్ అండ్ మోర్ ఫన్ అనే టైటిల్ ఉండబోతుందని టాక్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories