మహేష్ కు బ్లాక్ బస్టర్ అందేనా?

మహేష్ కు బ్లాక్ బస్టర్ అందేనా?
x
Highlights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మైలురాయిగా చిత్రంగా 'మహర్షి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి...

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో మైలురాయిగా చిత్రంగా 'మహర్షి' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా మే 9న విడుదలకు సిద్ధమవుతోంది. అల్లరి నరేశ్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వసూళ్లు ఎలా ఉండబోతున్నాయి అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా మహేష్ కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ గా మారుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

ఈ చిత్ర పాటలు పెద్దగా మెప్పించలేకపోయినప్పటికీ టీజర్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందింది. పైగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న 'ఎవెంజర్స్' వంటి సినిమాల హవా అప్పటికీ తగ్గిపోతుంది. కాబట్టి 'మహర్షి'కి అది మరొక ప్లస్ పాయింట్ గా మారనుంది. ఓపెనింగ్ డే రోజున భారీ వసూళ్లు వస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు. కానీ ఆ తరువాత కూడా 'మహర్షి' సినిమా అదే జోరు కనబరుస్తుందో లేదో చూడాలి. కంటెంట్ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా 'రంగస్థలం' రికార్డులను బద్దలు కొట్టి నాన్-బాహుబలి రికార్డులు మారుస్తుందని చెప్పుకోవచ్చు. మరి 'మహర్షి' రేంజ్ ఏంటో తెలియాలంటే మే 9 వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories