మళ్ళీ అజయ్ గానే కనిపించనున్న సూపర్ స్టార్ ..

మళ్ళీ అజయ్ గానే కనిపించనున్న సూపర్ స్టార్ ..
x
Highlights

మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సరిలేరు నికేవ్వరు .. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు .. ఇందులో మహేష్ ఓ ఆర్మీ పాత్రలో కనిపిస్తున్నాడు . సినిమా...

మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సరిలేరు నికేవ్వరు .. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి దర్శకుడు .. ఇందులో మహేష్ ఓ ఆర్మీ పాత్రలో కనిపిస్తున్నాడు . సినిమా టైటిల్ లో కూడా ఆర్మీ లోగోను పెట్టారు .. అయితే ఇందులో మహేష్ అజయ్ కృష్ణ గా కనిపించనున్నారు .. దీనికి సంబంధించిన ఓ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .. ఇందులో అజయ్ కృష్ణ అని ఓ ఆర్మీ చొక్కా పై ఉంది . దీనిని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ షేర్స్ చేస్తున్నారు..

ఇంతకుముందు మహేష్ ఒక్కడు , దూకుడు సినిమాలో అజయ్ అనే పాత్రలో కనిపించాడు .. అ రెండు సినిమాలు మహేష్ కెరియర్ ని ఒక్కసారిగా టర్న్ చేసాయనే చెప్పాలి .. అయితే అందులో భాగంగానే మరోసారి అజయ్ గా కనిపించనున్నాడు మహేష్ .. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు .. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత .. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories