మళ్ళీ పాత రోజులు తిరిగి పొందాలంటే అది తప్పనిసరి : మహేష్

మళ్ళీ పాత రోజులు తిరిగి పొందాలంటే అది తప్పనిసరి : మహేష్
x
Highlights

చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . ఈ కరోనా వైరస్ వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు.

చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది . ఈ కరోనా వైరస్ వలన చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. మరికొంతమంది ప్రాణాలతో పోరాడుతున్నారు. ప్రస్తుతం దీనికి వాక్సిన్ లేకపోవడంతో వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యమని ప్రభుత్వాలు చెబుతున్నాయి. బయటకు వెళ్తే మాస్క్ లు తప్పనిసరి అని శానిటైజర్లు కూడా ముఖ్యమని ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఇక ఇదే అంశంపైన సెలబ్రిటీలు కూడా తమ వంతు భాధ్యతగా కరోనా పై జాగ్రత్తలు చెబుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాస్క్ ధరించి ఫోట్ షేర్ చేస్తూ .." నెమ్మదిగా అందరం లాక్ డౌన్ నుండి బయటకు వస్తున్నాం.. అలానే వస్తాం కూడా.! ఐతే బయటక్కు వచ్చేటప్పుడు మాస్క్ ధరించటం తప్పని సరి .. మాస్క్ మన జీవితాల్లో భాగం అవుతుందని, మాస్క్ ధరించటం వల్ల మనల్ని మనం కాపాడుకోవటంతో పాటుగా.. మన పక్కనవాళ్ళని, అలానే సమాజాన్ని కాపాడినవాళ్ళం అవుతాం అని మహేష్ పేర్కొన్నారు. ఇక మ‌రో ట్వీట్‌లో మాస్క్ ధ‌రించడం కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. కాని ఇలాంటి ప‌రిస్థితుల‌లో మాస్క్ ధ‌రించడం త‌ప్పదు. పాత రోజులు తిరిగి పొందాలంటే మాస్క్ ధ‌రించ‌డం ఒక్కటే మ‌న‌కి మార్గం అని మ‌హేష్ వెల్లడించారు.

ఇక దేశంలో కరోనా తీవ్రత రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో అత్యధికంగా 6088 కేసులు నమోదు కాగా, 148 మంది ప్రాణాలు విడిచారు. దేశంలో ఒక్క రోజులో అత్యధిక స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే తొలిసారి. దీంతో ఇండియాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,18,447కి చేరుకుంది. ఇప్పటి వ‌ర‌కు మ‌న దేశంలో క‌రోనా వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 3583కి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక ఇందులో ఇప్పటివరకు 48,534మంది కోలుకోగా మరో 66,330మంది చికిత్స పొందుతున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories