మహేష్ బాబు vs త్రివిక్రమ్

మహేష్ బాబు vs త్రివిక్రమ్
x
Highlights

ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకేవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంటపురములో సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాలను అందించాయి.

ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబు సరిలేరు నీకేవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాలను అందించాయి. రెండు సినిమాలు 200 కోట్ల మార్క్ ని దాటి టాలీవుడ్ ఇండస్ట్రీ సత్తా ఏంటో చాటాయి. ఇందులో సరిలేరు కంటే అలనే ఓ మెట్టుపై చేయి సాధించిందని చెప్పాలి. ఇక ఈ సినిమాల తరవాత వచ్చిన సినిమాలు కూడా ఆ వసూళ్లను కొనసాగించలేకపోయాయి.

అయితే ఇప్పుడు మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. మహర్షి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వీరు మళ్ళీ కలిసి సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అల అల వైకుంఠపురములో సినిమా తర్వాత త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సినిమాకి కమిట్ అయ్యాడు. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ పై కే రాధాకృష్ణ , ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ కలిసి నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ వచ్చింది. మళ్ళీ ఇదే కాంబినేషన్ లో సినిమా వస్తుండడంతో మంచి బజ్ ఏర్పడింది.

అయితే మహేష్ - వంశీ, ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాలు 2021 సమ్మర్ కే రిలీజ్ కానున్నాయి. ఇందులో త్రివిక్రమ్ ఇప్పటికే కర్చీప్ వేసుకొని కూర్చున్నాడు. ఇక మహేష్ కూడా వేసవికే రానున్నాడు. దీనితో సంక్రాంతికి మళ్ళీ మహేష్ బాబు వర్సెస్ త్రివిక్రమ్ అన్నట్టుగా సాగనుంది. మరి ఇందులో ఎవరు పై చేయి సాధిస్తారు అన్నది చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories