Telugu Bigg Boss 4కి హోస్ట్ గా ఎవరంటే?

Telugu Bigg Boss 4కి  హోస్ట్ గా ఎవరంటే?
x
BIGGBOSS
Highlights

నార్త్ నుంచి వచ్చి సౌత్ లో పాతుకుపోయింది బిగ్ బాస్ షో.. ఇక తెలుగులో ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా మూడు సిజన్స్ ని కంప్లీట్ చేసుకుంది.

నార్త్ నుంచి వచ్చి సౌత్ లో పాతుకుపోయింది బిగ్ బాస్ షో.. ఇక తెలుగులో ఇప్పటికి సక్సెస్ ఫుల్ గా మూడు సిజన్స్ ని కంప్లీట్ చేసుకుంది.. మొదటగా ఈ షోపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ ఎన్టీఆర్ తనదైన స్టైల్ లో షో మొదటి సీజన్ కి హోస్ట్ గా చేసి షోని ఓ లెవల్ లో నిలబెట్టాడు. ఇక రెండో సీజన్ కూడా అందరు ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తాడని అనుకున్నారు.. కానీ ఎవ్వరు ఉహించనట్టుగా హీరో నాని పేరు తెరపైకి వచ్చింది.

న్యాచురల్ గా హోస్ట్ చేసి సత్తా చాటాడు. కానీ ఈ సీజన్ లో నాని హోస్టింగ్ కంటే వివాదాలే ఎక్కువగా పాపులర్ అయ్యాయి. దీనితో థర్డ్ సీజన్ కి నో చెప్పడంతో బిగ్ బాస్ నిర్వాహకులకి మరొకరిని వెతుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ తరుణంలో అప్పటికే మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి సక్సెస్ ఫుల్ ప్రోగ్రామ్స్ చేసి ఉన్న నాగ్ ఉండడంతో నాగ్ అయితేనే దీనికి కరెక్ట్ అని భావించగా కండిషన్స్ అప్లే అని చెప్పి సీజన్ త్రీకి హోస్ట్ గా చేసి షోని సక్సెస్ చేశాడు నాగ్ ..

ఇప్పటికి చాలా భాషాల్లో బిగ్ బాస్ షో నడుస్తుంది. కానీ అక్కడ సిజన్స్ మారుతాయి. కంటేస్టెంట్లు మారుతారు కానీ హోస్ట్ గా మాత్రం ఒక్కరే ఉంటారు. కానీ తెలుగులో మాత్రం జరిగిన మూడు సిజన్స్ కి ముగ్గురు హోస్ట్ గా చేశారు. దీనితో ఇప్పుడు జరగబోయే నాలుగో సీజన్ కి హోస్ట్ గా ఎవరు అన్నదానిపై ఆసక్తి నెలకొంది...తెలుగు బిగ్ బాస్ 4 హోస్ట్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, రానా, చిరంజీవి, అల్లు అర్జున్ పేర్లు వినిపించాయి. ఇప్పుడు ఈ లిస్టు లోకి మరో హీరో పేరు వచ్చింది. అతనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు..

తెలుగు బిగ్ బాస్ 4 హోస్ట్ గా మహేష్ బాబు వ్యవహరించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే స్టార్ మా యాజమాన్యం మహేష్ తో సంప్రదింపులు చేసిందని, మహేష్ కూడా దీనికి ఒకే చెప్పాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ సీజన్ ని హోస్ట్ కి గాను మహేష్ కి స్టార్ మా భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేసినట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన లేదు..ప్రస్తుతం వరుస విజయాలతో మంచి ఉపు మీదా ఉన్న మహేష్ సీజన్ 4 కి హోస్ట్ గా చేస్తే మాత్రం షో టీఆర్పీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories